- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీఆర్ఎస్ బీజేపీతో కలిసేందుకు ప్రయత్నించింది: బండి సంజయ్
బీఆర్ఎస్‌లో చార్‌పత్తా ఆట నడుస్తోందని బీజేపీ ఎంపీ బండి సంజయ్ అన్నారు. కవిత వ్యవహారం అంతా ఓ ఫ్యామిలీ డ్రామా అంటూ ఆరోపించారు.

దిశ, వెబ్ డెస్క్: బీఆర్ఎస్‌లో చార్‌పత్తా ఆట నడుస్తోందని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. కవిత వ్యవహారం అంతా ఓ ఫ్యామిలీ డ్రామా అంటూ ఆరోపించారు. రాష్ట్రంలో కల్వకుంట్ల ఆర్ట్స్ క్రియేషన్స్ డ్రామా జరుగుతోందని ఎద్దేవా చేశారు. కల్వకుంట్ల సినిమాకు కాంగ్రెస్ ప్రొడక్షన్ చేస్తుందని విమర్శించారు. బీజేపీ బీఆర్ఎస్ ఎప్పుడూ కలవవు అని స్పష్టం చేశారు. కవిత అరెస్ట్ అవ్వకుండా ఉండటానికి బీఆర్ఎస్ బీజేపీతో కలిసేందుకు ప్రయత్నించిందని అన్నారు.
కానీ అవినీతి బీఆర్ఎస్ తో బీజేపీ కలవదు అని బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి పనిచేశాయని చెప్పారు. వేములవాడ రాజన్న గోశాలలో కోడెలు మరణించడం బాధాకరం అని ఆలయ ఈవోతో మాట్లాడతానని అన్నారు. కోడెల సంఖ్యకు అనుగుణంగా గోశాలను విస్తరించాలని బండి సంజయ్ సూచించారు. రాజన్న ఆలయం నిధులను మాజీ సీఎం వేరే చోట ఖర్చు చేశారని ఆరోపించారు. సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఆర్మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీసేలా ఉన్నాయని చెప్పారు. పాక్ పై యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉందని ప్రధాని చెప్పారని గుర్తు చేశారు.






