బాలకృష్ణ సినిమాలు చూసేందుకు విద్యార్థులు బెట్టింగ్ వేస్తున్నారు: బండి సంజయ్

by Ajay Maddhiboyina |

నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన అఖండ 2 సినిమాపై కేంద్ర‌మంత్రి బండి సంజ‌య్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. బాల‌కృష్ణ సినిమాలు చూడడం కోసం కాలేజీలు, స్కూళ్ల‌లో బెట్టింగులు వేసుకుంటున్నార‌ని అన్నారు.

బాలకృష్ణ సినిమాలు చూసేందుకు విద్యార్థులు బెట్టింగ్ వేస్తున్నారు: బండి సంజయ్
X

దిశ‌, వెబ్ డెస్క్: నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన అఖండ 2 సినిమాపై కేంద్ర‌మంత్రి బండి సంజ‌య్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. బాల‌కృష్ణ సినిమాలు చూడడం కోసం కాలేజీలు, స్కూళ్ల‌లో బెట్టింగులు వేసుకుంటున్నార‌ని అన్నారు. ఇది వ‌ర‌కు బెట్టింగ్ వేసుకుంటే ఏం ఇస్తావ్.. ఏం చేస్తావ్ అని అడిగేవాళ్ల‌ని ఇప్పుడు బాల‌య్య సినిమాలు చూపించాల‌ని బెట్టింగ్ వేసుకుంటున్నార‌ని చెప్పారు. బాలకృష్ణ‌లో సీనియ‌ర్ ఎన్టీఆర్ ను చూసుకుంటున్నామ‌ని అన్నారు.

ఎన్టీఆర్ ను బాల‌య్య మైమ‌రిపిస్తున్నార‌ని వ్యాఖ్యానించారు. బాల‌య్య సినిమా చూస్తుంటే నిజంగా శివుడు ప్ర‌త్య‌క్షం అయ్యాడేమో అనిపించింద‌ని అన్నారు. ఆయ‌న గొప్ప న‌టుడు అని కొనియాడారు. ఇదిలా ఉంటే బాల‌య్య హీరోగా న‌టించిన అఖండ 2 సినిమాకు బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌కత్వం వ‌హించారు. ఈ సినిమా అఖండ సినిమాకు సీక్వెల్ గా తెర‌కెక్కింది. సినిమాలో బాల‌కృష్ణ అఘోరా పాత్ర‌లో న‌టించారు. అయితే ఈ సినిమా భారీ అంచ‌నాల మ‌ధ్య ప్రేక్ష‌కుల ముందుకు రాగా ఆ అంచ‌నాల‌ను రీచ్ అవ్వ‌లేక‌పోయింది.

Next Story