- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాలయ్య సేవలు మరవలేనివి: బండి సంజయ్
గ్లామర్ ప్రపంచంలో అర్ధశతాబ్దానికిపైగా హీరోగా కొనసాగడం అరుదైన విషయమని, ఆ ఘనత హీరో బాలక్రిష్ణకు దక్కిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. వయసు మీద పడినా వన్నె తగ్గలేదని నిరూపిస్తూ హీరో బాలయ్య చేస్తున్న ప్రయాణం అన్ స్టాపబుల్ అని వ్యాఖ్యానించారు.

దిశ, తెలంగాణ బ్యూరో : గ్లామర్ ప్రపంచంలో అర్ధశతాబ్దానికిపైగా హీరోగా కొనసాగడం అరుదైన విషయమని, ఆ ఘనత హీరో బాలక్రిష్ణకు దక్కిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. వయసు మీద పడినా వన్నె తగ్గలేదని నిరూపిస్తూ హీరో బాలయ్య చేస్తున్న ప్రయాణం అన్ స్టాపబుల్ అని వ్యాఖ్యానించారు. సినిమాల్లోనూ కాకుండ నిజజీవితంలోనూ ఆయన అందిస్తున్న సేవలు మరువలేనివని అన్నారు. బసవ తారకం ఆసుపత్రిని స్థాపించిన ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న వేలాది మంది క్యాన్సర్ రోగులకు కాపాడుతున్నారని చెప్పారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చినా ఎమ్మెల్యేగా అన్ స్టాపబుల్ జర్నీని కొనసాగిస్తున్నారని తెలిపారు.
హీరోగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం హైటెక్ సిటీలోని హోటల్ ట్రైడెంట్ లో జరిగిన ‘‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, యూకే’’ నిర్వాహకులు ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. టాలీవుడ్ లో ఎన్నో ప్రయోగాలు చేసిన నటుడుగా అనేక పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘిక చిత్రాల్లో నటించి ఆల్ రౌండర్ గా సత్తా చాటిన పరిపూర్ణ నటుడు అని ప్రశంసించారు. కళారంగానికి బాలయ్య చేసిన సేవలకు భారతదేశ 3వ అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ అవార్డుతో కేంద్ర ప్రభుత్వం సత్కరిస్తే ఎన్టీఆర్ నేషనల్ అవార్డుతో తెలంగాణ ప్రభుత్వం సన్మానించడం సంతోషంగా ఉందన్నారు. కథా నాయకుడు, మహా నాయకుడు పేరిట సినిమాలను తెరకెక్కించి దాదాపు 60 గెటప్ లతో నటించి మెప్పించి ఎన్టీఆర్ గొప్పతనాన్ని ప్రజలకు చాటిచెప్పిన నందమూరి వారసుడు మన బాలయ్య అని పొగిడారు.






