నాపై బేధాభిప్రాయాలు ఉంటే తీసేయండి.. బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్

by Ajay Maddhiboyina |

ఈట‌ల రాజేంద‌ర్‌తో విభేదాలపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ మీడియా సమావేశంలో.. బండి సంజయ్ ఈటల మధ్య ఆధిపత్య పోరుజరుతుందని వార్తలు వస్తున్నాయని, కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన ప్లెక్సీలలో ఆయన ఫోటోలు ఎందుకు వేయలేదని మీడియా ప్రతినిధి ప్రశ్నించారు.

నాపై బేధాభిప్రాయాలు ఉంటే తీసేయండి.. బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్
X

దిశ‌, వెబ్ డెస్క్: ఈటెల రాజేంద‌ర్‌తో విభేదాలపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ మీడియా సమావేశంలో.. బండి సంజయ్ ఈటెల మధ్య ఆధిపత్య పోరుజరుతుందని వార్తలు వస్తున్నాయని, కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన ప్లెక్సీలలో ఆయన ఫోటోలు ఎందుకు వేయలేదని మీడియా ప్రతినిధి ప్రశ్నించారు. దానికి బండి సంజయ్ సమాధానం ఇస్తూ.. బేధాలు అభిప్రాయ బేధాలు అనేవి అవాస్తవం అని అన్నారు. బండి సంజయ్ గా పార్టీ సిద్ధాంతం కోసమే తాను పనిచేస్తానని చెప్పారు. పార్టీ జెండా కిందనే పనిచేస్తానని చెప్పారు. పార్టీ ఏం చెబితే అధి చేస్తానని అన్నారు.

తాను కమిట్మెంట్ తో కార్యకర్తల కోసం కష్టపడి పనిచేస్తానని చెప్పారు. తనపై ఎవరికైనా బేధాభిప్రాయాలు ఉంటే మనసులో నుండి తీసేయాలని అన్నారు. తన గురించి మంచిగా ఆలోచించాలని, పార్టీ గురించి మంచిగా ఆలోచించాలని కోరారు. ఇదిలా ఉంటే బీజేపీ నేతలు ఈటెల రాజేందర్, బండి సంజయ్ మధ్య విభేదాలు ఉన్నాయంటూ చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. గతంలో తన నియోజకవర్గంలో స్థానిక ఎన్నికల్లో టికెట్లను తన వర్గానికి ఇస్తానని ఓ నేత ప్రచారం చేసుకున్నాడని ఈటెల మండిపడ్డారు. కుల, మత రాజకీయాలు తెలంగాణలో పనిచేయవని చెప్పారు. ఇక ఇటీవల కరీంనగర్ లో ఏర్పాటు చేసిన ప్లెక్సీలలో ఈటెల ఫోటోలు కనిపించలేదు. వీరిద్దరి మధ్య సైలెంట్ వార్ నడుస్తోందని ప్రచారం జోరందుకుంది.

Next Story