- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రాణహిత పుష్కరాలపై చిన్నచూపు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రాణహిత నది పుష్కరాలపై తెలంగాణ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రాణహిత నది పుష్కరాలపై తెలంగాణ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో ఆరోపించారు. ఈనెల 13 నుంచి ప్రాణహిత నది పుష్కరాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు అభివృద్ధికి పూర్తిస్థాయిలో నిధులు కేటాయించకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. 12 ఏండ్లకోసారి జరిగే ప్రాణహిత పుష్కరాలకు తెలంగాణ నుంచే కాకుండా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఏపీ సహా పొరుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు కాళేశ్వరం తరలివచ్చే అవకాశం ఉందన్నారు. భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించకపోవడం అత్యంత దారుణమని ఆయన సర్కార్తీరుపై ఫైరయ్యారు. రాష్ట్ర ఆవిర్భావం అనంతరం ప్రాణహితకు తొలి పుష్కరాలని, సీఎం కేసీఆర్భక్తుల సౌకర్యాల కల్పనపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని డిమాండ్చేశారు. స్నాన ఘట్టాలు, మరుగుదొడ్ల నిర్మాణంసహా తాగునీటి, వైద్య శిబిరాలు వంటి కనీస సౌకర్యాల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే నిధులు మంజూరు చేయాలని బండి సంజయ్డిమాండ్ చేశారు.






