ఆ పని చేయడం మీ వల్ల అవుతుందా?.. కేసీఆర్‌కు బండి సంజయ్ సవాల్

by Gantepaka Srikanth |

బీసీలకు బీజేపీ(BJP) అధ్యక్ష పదవి ఎందుకు ఇవ్వడం లేదనే బీఆర్ఎస్(BRS) నేతల ప్రశ్నలకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) సమాధానం ఇచ్చారు.

ఆ పని చేయడం మీ వల్ల అవుతుందా?.. కేసీఆర్‌కు బండి సంజయ్ సవాల్
X

దిశ, వెబ్‌డెస్క్: బీసీలకు బీజేపీ(BJP) అధ్యక్ష పదవి ఎందుకు ఇవ్వడం లేదనే బీఆర్ఎస్(BRS) నేతల ప్రశ్నలకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) సమాధానం ఇచ్చారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మమ్మల్ని ప్రశ్నించే ముందు పార్టీ గురించి చూసుకోవాలని హితవు పలికారు. కేసీఆర్(KCR) కాకుండా.. మరో నేతకు బీఆర్ఎస్ అధ్యక్ష పదవి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. దమ్ముంటే బీఆర్ఎస్ ప్రెసిడెంట్ పదవి బీసీలకు ఇవ్వాలని సవాల్ చేశారు. దళితుడిని సీఎం చేస్తా అన్నారు.. తల నరక్కుంటా అన్నారని గుర్తుచేశారు. బీఆర్ఎస్ నేతల్లా తాము మాట తప్పే మనుషులం కాదని.. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే తప్పకుండా బీసీ నేతనే ముఖ్యమంత్రి అవుతాడని బండి సంజయ్ కీలక ప్రకటన చేశారు. ఇప్పటికే బీసీల్లో తనకు, లక్ష్మణ్‌కు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చారని గుర్తుచేశారు.

ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వమున్న పార్టీ బీజేపీ. దేశంలో, అనేక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీ. సిద్ధాంతం కోసం కమిట్ మెంట్‌తో పనిచేసే లక్షలాది కట్టర్ కార్యకర్తలున్న పార్టీ బీజేపీ. అంత గొప్ప చరిత్ర కలిగిన బీజేపీ ఒకరు చెబితేనే, ఇంకొకరు ఒత్తిడి తెస్తేనో తలొగ్గి నిర్ణయం తీసుకునే పార్టీ బీజేపీ కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని బండి సంజయ్ అన్నారు. జాతీయ నాయకత్వం ఇంకా రాష్ట్ర అధ్యక్షుడి పేరును ప్రకటించలేదు. పదవి కోసం ఎవరైనా నామినేషన్ వేసే అవకాశముంది. అధ్యక్షుడు కావాలని కోరుకోవడంలో కూడా తప్పులేదు. కానీ అన్ని విషయాలను పరిగణలోకి తీసుకుని పార్టీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని హైకమాండ్(BJP High Command) నిర్ణయం తీసుకుంటుందని అన్నారు.

Next Story