రెండు జిల్లాల కలెక్టర్లకు బండి సంజయ్ ఫోన్.. కారణం ఇదే!

by Gantepaka Srikanth |

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్(Bandi Sanjay) కొద్దిసేపటి క్రితం కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల కలెక్టర్లు పమేలా సత్పతి, సందీప్ కుమార్ ఝా లకు ఫోన్ చేశారు.

రెండు జిల్లాల కలెక్టర్లకు బండి సంజయ్ ఫోన్.. కారణం ఇదే!
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్(Bandi Sanjay) కొద్దిసేపటి క్రితం కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల కలెక్టర్లు పమేలా సత్పతి, సందీప్ కుమార్ ఝా లకు ఫోన్ చేశారు. ప్రస్తుతం న్యూఢిల్లీలో ఉన్న కేంద్ర మంత్రి నార్త్ బ్లాక్ లోని తన కార్యాలయం నుండి ఆయా కలెక్టర్లకు ఫోన్లు చేసి ఆయా జిల్లాల్లో ఇప్పటి వరకు కురిసిన వర్షాలు, జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. రానున్న మూడు రోజులపాటు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో తీసుకున్న ముందస్తు జాగ్రత్తలపై ఆరా తీశారు. అకస్మిక వరదలు సంభవిస్తే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ నష్ట నివారణ చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యుత్‌కు సంబంధించి అత్యవసర సమయాల్లో ఉపయోగించుకునేందుకు వీలుగా మొబైల్ ట్రాన్స్ఫర్స్ అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా రెండు జిల్లాల పరిధిలో ప్రజలకు ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా 24 గంటలు అందుబాటులో సిబ్బంది సేవలను ఉంచాలని కోరారు. భారీ వర్షాల నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రజలకు సూచించారు.

Next Story