- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బండి సంజయ్ ఈ కోటి రూపాయల ప్రశ్నకు సమాధానం చెప్పు.. కాంగ్రెస్ ఎంపీ సూటి ప్రశ్న
బండి సంజయ్ ఈ కోటి రూపాయల ప్రశ్నకు సమాధానం చెప్పాలని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala Kiran Kumar Reddy) అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: బండి సంజయ్ ఈ కోటి రూపాయల ప్రశ్నకు సమాధానం చెప్పాలని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala Kiran Kumar Reddy) అన్నారు. గాంధీ భవన్ (Gandhi Bhavan) లో మీడియాతో మాట్లాడిన ఆయన.. హెచీసీయూ భూముల విషయం (HCU Lands Issue)లో విపక్షాలు దష్ప్రచారాలు చేస్తున్నాయని మండిపడ్డారు. మాజీ యువరాజు కేటీఆర్ (KTR) తెలంగాణలో నెగిటివ్ పాలిటిక్స్, నెగిటివ్ పాలసీస్ తో ముందుకు వెళుతూ.. ఏఐ వీడియోలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. కేటీఆర్ చేస్తున్న ఏఐ ప్రచారాన్ని కేంద్రమంత్రులు సహా ఇన్విరాన్ మెంటలిస్టులు కూడా నమ్మి మోసపోయారని తెలిపారు.
ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) జ్యోబాపులే విగ్రహం పెట్టాలని ధర్నా చేస్తుంటే నవ్వు వస్తుందని అన్నారు. ఆమెను ఎవరు గుర్తించే పరిస్థితిలో లేరని, కవిత గుర్తింపు కోసమే ఇలాంటివి చేస్తున్నారని ఎద్దేవా చేశారు. నిత్యం వార్తల్లో ఉండేందుకు ఏదో ఒక అంశాన్ని పట్టుకొని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఆమెకు మీడియా స్పేస్ ఇచ్చి, టీఆర్పీ పెంచాలని సూచించారు. జైలుకు వెళ్లొచ్చిన తర్వాత ఆమె గ్రాఫ్ ను పెంచుకునే పనిలో పడ్డారని, బహుబలి సినిమాలో మాహిశ్మతి సామ్రాజ్యానికి లేడీ డాన్ లా కవిత నిలవాలనుకుంటోందని వ్యాఖ్యానించారు.
ఆమె అనుముల ఇంటలిజెన్స్ అని మాట్లాడుతున్నారని, వాళ్లు ఏఐ ఇంటలిజెన్స్ తో ఫోన్ ట్యాపింగ్ లు చేశారని, దానిని అనుముల ఇంటలిజెన్స్ ఉపయోగించి బయటికి తీస్తున్నామని తెలిపారు. ఇక బండి సంజయ్ (Bandi Sanjay) గురించి ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదని ఆయన తెలంగాణలో ల్యాండ్ కాగానే కేంద్రమంత్రి (Union Minister) నుంచి కార్పోరేటర్ (Corporator) అయిపోతారని, కార్పోరేటర్ గా పరకాయ ప్రవేశం చేస్తారని, అవగాహన లేకుండా మాట్లాడుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కౌన్ బనేగా కరోర్ పతీలో అమితాబ్ అడిగినట్లు బండి సంజయ్ ఈ కోటి రూపాయల ప్రశ్నకు సమాధానం చెప్పాలని అన్నారు. 2003 లో భారత ప్రధాని ఎవరు అని ప్రశ్నించారు.
దానికి ఇందిరాగాంధీ (Indira Gandhi), సోనియా గాంధీ (Sonia Gandhi), వాజ్ పేయి (Wajpeyi), నెహ్రూ (Nehru) అంటూ నాలుగు ఆప్షన్లు కూడా ఇచ్చారు. హెచ్ సీయూ భూముల అంశంలో ఆనాడు వాజ్ పేయ్ ప్రధానమంత్రిగా ఉన్నారని, ఆయన ప్రభుత్వంలో భాగమై ఉండి రాష్ట్రంలో అధికారంలో ఉన్న చంద్రబాబు (Chandrababu) భూములను బిన్నీరావు అప్పగించారని తెలిపారు. దీనిపై ఏ మాత్రం అవగాహన లేని బండిసంజయ్ సీబీఐ ఎంక్వైరీ వేస్తామని మాట్లాడుతున్నారని, ఆనాడు ప్రభుత్వంలో ఉన్నది మీరేనని, ఎవరిపై సీబీఐ ఎంక్వైరీ వేస్తారో చెప్పాలని అన్నారు. బండి సంజయ్ ఏదైనా మాట్లాడే మందు దానిపై అవగాహన పెంచుకొని మాట్లాడాలని చామల కిరణ్ సలహా ఇచ్చారు.






