బీజేపీ మున్సి‘పోల్’వ్యూహాలు.. కాంగ్రెస్‌కు ధీటుగా స్ట్రాటజీ

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-02-06 02:31:01  IST  )

కరీంనగర్, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ల గెలుపును బీజేపీ ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అర్వింద్‌లు ప్రెస్టీజియస్ సవాల్‌గా తీసుకున్నారు.

బీజేపీ మున్సి‘పోల్’వ్యూహాలు.. కాంగ్రెస్‌కు ధీటుగా స్ట్రాటజీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: కరీంనగర్, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ల గెలుపును బీజేపీ ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అర్వింద్‌లు ప్రెస్టీజియస్ సవాల్‌గా తీసుకున్నారు. ఆ రెండు చోట్ల సొంతంగా మేయర్ పదవిని దక్కించుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. అందుకోసం కావాల్సిన మెజార్టీ కార్పోరేటర్లను గెలిపించుకునేందుకు కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగా వారిద్దరు ప్రత్యేకంగా మానిటరింగ్ చేస్తున్నారు. ఎన్నికల షెడ్యూలు కంటే ముందుగానే అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టి గెలుస్తారనుకునే అభ్యర్థులను ఎంపిక చేశారు. ప్రస్తుతం ప్రతి డివిజన్‌లో పర్యటిస్తూ ప్రచారం కొనసాగిస్తున్నారు.

చాలెంజ్‌గా తీసుకున్న ఎంపీలు

ఈ ఎలక్షన్‌ను సంజయ్, అర్వింద్‌లు ఇంత సీరియస్‌గా తీసుకోవడం వెనుక పార్టీలో ఉన్న రాజకీయ పరిస్థితులు ఒక కారణమైతే, స్థానికంగా తమ సత్తా చాటుకోవాల్సిన అవసరం మరో కారణం. ఒకవేళ మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుంటే పార్టీలో ఎంపీల పరపతి అమాంతం పెరిగిపోతుంది. ఆ ఊపు రానున్న అసెంబ్లీ ఎన్నికలకు మిగతా ఏరియాల్లో బూస్టింగ్‌గా ఉపయోగపడుతుంది. ఓడిపోతే మాత్రం సొంత నియోజకవర్గంలో సత్తా చూపించలేకపోయారనే అపవాదును మూటగట్టుకోక తప్పదు. అందుకే ఆ ఇద్దరు లీడర్లు ఎలాగైనా కార్పోరేషన్‌లో బీజేపీ జెండా ఎగురవేయాలని తపనతో పనిచేస్తున్నారు.

సొంత స్ట్రాటజీతోనూ ముందుకు

గెలవాలనే టార్గెట్‌తో ఇద్దరు పార్టీ సహాయ సహకారాల కంటే సొంత స్ట్రాటజీతోనే పనిచేస్తున్నారు. ఎన్నికలకు కావాల్సిన వనరులను సొంతంగానే సమకూర్చుకుని అభ్యర్థులకు ఏ లోటు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరీంనగర్‌లో 66 డివిజన్లు ఉండగా గత ఎన్నికల్లో 13 మాత్రమే గెలిచారు. కానీ, ఈసారి 40 పైగా స్థానాల్లో విజయం సాధించి ఎవరి సహాకారం అవసరం లేకుండానే మేయర్ పదవిని సొంతం చేసుకోవాలనే ప్లాన్‌లో సంజయ్ ఉన్నారు. నిజామాబాద్ లో 60 డివిజన్లు ఉండగా గత ఎన్నికల్లో 24 స్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా నిలిచింది. కానీ.. బీఆర్ఎస్, మజ్లీస్‌లు కలవడంతో మేయర్ పీఠం గులాబీ పార్టీకి దక్కింది. ఈసారి కనీసం 40 స్థానాల్లో గెలిచి మేయర్ పదవిని దక్కించుకోవాలనే ప్లాన్‌లో అర్వింద్ ఉన్నారు.

Next Story