- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Bandi Sanjay: పాక్ వెన్నులో వణుకు పుట్టేలా చర్యలుంటాయ్.. బండి సంజయ్ హాట్ కామెంట్స్
పహల్గాం ఉగ్రదాడికి కౌంటర్‌గా పాక్ వెన్నులో వణుకు పుట్టేలా చర్యలు ఉంటాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: పహల్గాం ఉగ్రదాడికి కౌంటర్‌గా పాక్ వెన్నులో వణుకు పుట్టేలా చర్యలు ఉంటాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఇవాళ హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో నిర్వహించిన ‘రోజ్ గార్ మేళా’కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఉద్యోగాలకు ఎంపికైన 100 మంది అభ్యర్థులకు అపాయిట్‌మెంట్ లెటర్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ.. అమాయక టూరిస్టుల ప్రాణాలు తీసిన ప్రాక్ ప్రేరేపిత ఉగ్ర మూకలు తగిన మూల్యం చల్లించుకోక తప్పదని అన్నారు.
తుపాకీ పట్టినోడు ఆ తుపాకికే బలి అవుతాడంటూ కామెంట్ చేశారు. ఉగ్రవాదుల రాక్షసత్వానికి పరాకాష్ట పెహల్గాం ఘటన నిలించిందని అన్నారు. గత 30 ఏళ్లుగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నామంటూ స్వయంగా పాక్ రక్షణ శాఖ మంత్రే అంగికరించారని ఆరోపించారు. బిచ్చమెత్తుకునే దుస్థితికి చేరినా దాయాది పాక్‌కు ఇంకా బుద్ధి మారడం లేదన్నారు. అభివృద్ధిలో దూసుకెళ్తున్న భారత్‌ను చూసి ఓర్వలేకపోతున్నారని ఫైర్ అయ్యారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్ తీసుకునే కఠిన నిర్ణయాలకు అందరూ ఏకతాటిపై ఉండి అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
ఇక ‘రోజ్‌గార్ మేళా’ ప్రధాని మోదీకి ఇష్టమైన కార్యక్రమమని.. దీంతో ఇప్పటి వరకు 10 లక్షల ఉద్యోగాల భర్తీ మార్క్‌కు చేరుకున్నామని అన్నారు. కష్టపడి ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు హ్యాట్సాప్ చేశారు. ఇష్టపడి పని చేసి దేశానికి సేవ చేయాలని యువతకు సూచించారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు చిట్టచివరి వ్యక్తికి కూడా అందేలా చూడాలని అధికారులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం యుతకు ఉద్యోగాలు కల్పించడంలో పూర్తి విఫలమైందని అన్నారు. పేపర్ లీకేజీలు, కాలయాపనతో నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి, అక్రమాలు విచ్చలవిడిగా చోటుచేసుకుంటున్నాయని బండి సంజయ్ ధ్వజమెత్తారు






