Bandi Sanjay: అదే జరిగితే మీ అందరికి రాజకీయ సమాదే.. కాంగ్రెస్, బీఆర్ఎస్ కు బండి మాస్ వార్నింగ్

by Prasad Jukanti |   (  Updated:2026-02-14 08:56:30  IST  )

కరీంనగర్‌లో బీజేపీ విజయం రాష్ట్ర ఇంటెలిజెన్స్ అంచనాలను తలకిందులు చేసిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. మేయర్ పీఠం కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఎం కుట్రలు చేస్తున్నాయని అదే జరిగితే మీకు కరీంనగర్ నుంచే రాజకీయ సమాధి చేస్తానంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

Bandi Sanjay: అదే జరిగితే మీ అందరికి రాజకీయ సమాదే.. కాంగ్రెస్, బీఆర్ఎస్ కు బండి మాస్ వార్నింగ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కరీంనగర్‍లో బీజేపీ విజయం రాష్ట్ర ఇంటెలిజెన్స్ కే అంకితం ఇస్తున్నామని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు. కరీంనగర్‍లో కార్పొరేషన్‍లో (Karimnagar) బీజేపీకి 13 సీట్లే వస్తాయని సీఎం రేవంత్ రెడ్డికి ఇంటెలిజెన్స్ నివేదిక ఇచ్చిందని అన్నారు. ఇవాళ మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన ఆయన.. సీఎం ఇకనైనా కళ్లు తెరవాలన్నారు. కరీంనగర్‍లో మేయర్ పదవి కోసం గుంట నక్కలన్నీ ఒక్కటయ్యాయని ఆరోపించారు. బీజేపీ సింహం.. సింగిల్‍గానే పోటీ చేస్తుందన్నారు.

కుట్రలు చేస్తే యుద్ధమే:
అంతకు ముందు ఇవాళ నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీస్‍లో మీడియాతో మాట్లాడిన బండి సంజయ్ కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు ఒక్కటేనని ఈ మూడు పార్టీలకు వాలంటైన్స్ డే శుభాకాంక్షలు అంటూ సెటైర్లు వేశారు. కరీంనగర్‍లో కాంగ్రెస్, బీఆర్ఎస్ చిల్లర రాజకీయాలు చేస్తున్నాయని కాంగ్రెస్, బీఆర్ఎస్ మేయర్ పీఠం ఎలా దక్కించుకుంటాయో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే అనే బండారం కరీంనగర్ వేదికగా బయటపడుతోందన్నారు. కరీంనగర్ మేయర్ పీఠం మాదేనని ఈ విషయాన్ని రాసిపెట్టుకోవాలని.. కాదని కాంగ్రెస్, బీఆర్ఎస్ కుట్రలు చేస్తే కరీంనగర్ నుంచే యుద్ధం స్టార్ట్ చేస్తానని, మీ అందరిని రాజకీయ సమాధి చేస్తానని హెచ్చరించారు. మీకు బీజేపీ కార్యకర్తల దమ్ము, శక్తి తెలియదన్నారు.

Dharmapuri Arvind: కాంగ్రెస్ ఓ బ్రోకర్ పార్టీ.. ఘాటు వ్యాఖ్యలతో రెచ్చిపోయిన ఎంపీ అర్వింద్

Next Story