- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బండి భగీరథ్ పోక్సో కేసు.. డీజీపీని కలిసిన బీఆర్ఎస్ మహిళా నేతలు
బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో తక్షణమే అరెస్ట్ చేయాలని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ డిమాండ్ చేశారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో: బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో (POCSO) కేసు అంశంలో కొనసాగుతున్న హైడ్రామాకు ఫుల్ స్టాప్ పెట్టాలని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ డిమాండ్ చేశారు. బుధవారం మహిళా నేతలతో కలిసి ఆమె డీజీపీకి వినతిపత్రం సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సామాన్యులకు ఒక రకంగా, కేంద్ర మంత్రి కొడుకుకు మరో రకంగా న్యాయం ఉండాలా అని ప్రశ్నించారు. కేసు నమోదై ఇన్ని రోజులైనా నిందితుడిని అరెస్ట్ చేయకపోవడం దుశ్చర్య అని ఆమె పేర్కొన్నారు. పోక్సో కేసులో నిందితుడు తప్పించుకు తిరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని నిలదీశారు. నిందితుడిపై కేవలం స్టేషన్ బెయిల్ వచ్చే సెక్షన్లు మాత్రమే పెట్టారని, దీనిని బట్టి పోలీసులపై ప్రభుత్వం నుంచి ఒత్తిడి ఉందని అర్థమవుతోందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా, హోంమంత్రిగా విఫలమయ్యారని విమర్శించారు.
Next Story






