Maoist Bandh: ఏజెన్సీ ప్రాంతాల్లో కొనసాగుతున్న బంద్.. విస్తృతంగా బలగాల తనిఖీలు

by Ramesh Naini |   (  Updated:2025-06-20 06:36:28  IST  )

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో మావోయిస్టుల బంద్ కొనసాగుతోంది.

Maoist Bandh: ఏజెన్సీ ప్రాంతాల్లో కొనసాగుతున్న బంద్.. విస్తృతంగా బలగాల తనిఖీలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో (Maoist Agency Areas) మావోయిస్టుల (Maoist bandh) బంద్ కొనసాగుతోంది. (Operation Kagar) ఆపరేషన్ కగార్ ఆపాలని, ఎన్‌కౌంటర్‌లను నిరసిస్తూ తెలుగు రాష్ట్రాల్లో మావోయిస్టులు జూన్ 20న (ఇవాళ) బంద్‌కు పిలుపు నిచ్చిన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఏజెన్సీ ప్రాంతాల్లో కేంద్ర, రాష్ట్ర బలగాలు విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టారు. బంద్ నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంత వాసులు భయం గుప్పిట్లో ఉన్నారు.

బంద్ కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు. మరోవైపు తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో.. ములుగు జిల్లాలో సాయుధ బలగాలు హై అలర్ట్ ప్రకటించారు. భద్రాచలం ఏజెన్సీలో పోలీసులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా గత రాత్రి చర్ల, దమ్ముగూడెం, వెంకటాపురం, వాజేడులో ఆర్టీసీ, ప్రైవేటు వాహనాల రాకపోకలను నిలిపివేశారు. మావోయిస్టులు విధ్వంసానికి పాల్పడొచ్చనే అనుమానంతో పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు.

Next Story