- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నటుడు నాగార్జునను కలిసిన బండారు దత్తాత్రేయ
సినీ నటుడు అక్కినేని నాగార్జున(Nagarjuna Akkineni)ను హరియాణా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ(Bandaru Dattatreya) కలిశారు.

దిశ, వెబ్‌డెస్క్: సినీ నటుడు అక్కినేని నాగార్జున(Nagarjuna Akkineni)ను హరియాణా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ(Bandaru Dattatreya) కలిశారు. శనివారం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో కలిసి ‘అలయ్ - బలయ్’కి రావాలని ఆహ్వానించారు. దత్తాత్రేయతో పాటు ఆయన కూతురు విజయలక్ష్మి(Vijayalaxmi) కూడా వెంట ఉన్నారు. కాగా, తెలంగాణలో బంధు మిత్రులను కలుసుకునేందుకు ఏర్పాటు చేసే కార్యక్రమం అలయ్ బలయ్(Alai - Balai). ముఖ్యంగా దసరా(Vijayadashami) సందర్భంగా నిర్వహిస్తారు పండుగనాడు సాధారణంగా అందరూ ఇంట్లో ఉంటారు.. తర్వాత రోజు బంధుమిత్రులను కలుసుకున్న సందర్భంగా పరస్పర ఆత్మీయాభిమానాలు చాటుకుంటూ కౌగిలించుకోవడం ద్వారా అలయ్ బలయ్ చెప్పుకుంటారు. తెలంగాణ సంస్కృతి, వారసత్వాన్ని అద్దం పట్టేలా ఈ ఉత్సవం జరుగుతుంది. భవిష్యత్ తరాల వరకూ ఈ విషయం తెలియాలని.. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక పేరుతో 2009న ‘అలయ్ - బలయ్’ పేరుతో బండారు దత్తాత్రేయ కార్యక్రమం ఏర్పాటు చేశారు. నాటి నుంచి అది కొనసాగుతూ వస్తోంది.






