- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
85శాతం పీజీ సీట్లు స్థానికులకు దక్కకుండా ప్రైవేటు మెడికల్ కాలేజీల కుట్ర.. హెచ్ఆర్డీఏ హెచ్చరిక
ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో తెలంగాణ ప్రభుత్వం 85శాతం పీజీ సీట్లను స్థానికులకు కేటాయిస్తూ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాన్ని హెల్త్ కేర్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ (హెచ్ఆర్డీఏ) సమర్ధిస్తోందని అయితే దీనిని జీర్ణించుకోలేని ప్రైవేటు మెడి

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో తెలంగాణ ప్రభుత్వం 85శాతం పీజీ సీట్లను స్థానికులకు కేటాయిస్తూ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాన్ని హెల్త్ కేర్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ (హెచ్ఆర్డీఏ) సమర్ధిస్తోందని అయితే దీనిని జీర్ణించుకోలేని ప్రైవేటు మెడికల్ కాలేజీల యాజమాన్యాలు కుట్రలు పన్నుతున్నాయని హెచ్ఆర్డీఏ సీనియర్ ప్రతినిధి బండారి డా. రాజ్ కుమార్ ఒక ప్రకటనలో ఆరోపించారు. 85శాతం రిజర్వేషన్లు రాష్ట్ర వైద్య విద్యార్థులకు ఎంతో ప్రయోజనాన్ని కల్పిస్తాయన్నారు.
జిల్లాల్లో స్పెషలిస్టు వైద్యుల కొరతను తగ్గించి వచ్చే 20 ఏళ్లలో తెలంగాణ హెల్త్ సిస్టమ్‌ను బలోపేతం చేసే ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజీల యాజమాన్యాలు అడ్డుకునేందుకు కోర్టులను ఆశ్రయిస్తున్నాయని ఆరోపించారు. ఎన్ఆర్ఐ, మేనేజ్‌మెంట్ సీట్లను వ్యాపారంగా మార్చుకుని స్థానికులకు నష్టం కలిగించే విధానాలను కొనసాగించాలనే ఉద్దేశంతో ఇతరుల ద్వారా కోర్టు కేసులు వేస్తూ ప్రభావితం చేయిస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం ఈ విషయంలో న్యాయపరంగా పోరాడాలని విజ్ఞప్తి చేశారు. తాము కూడా హెచ్ఆర్డీఏ తరఫున న్యాయపరంగాతీవ్రంగా పోరాడుతామని... ప్రైవేట్ కాలేజీల అనైతిక లాబీయింగ్‌ను బట్టబయలు చేస్తామని హెచ్చరించారు.






