Banakacherla Project: బీఆర్ఎస్ విమర్శలకు మంత్రి ఉత్తమ్ కమార్ రెడ్డి కౌంటర్

by Gantepaka Srikanth |

బనకచర్ల ప్రాజెక్టు(Banakacherla Project) విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), నీటిపారుదలశాఖ

Banakacherla Project: బీఆర్ఎస్ విమర్శలకు మంత్రి ఉత్తమ్ కమార్ రెడ్డి కౌంటర్
X

దిశ, వెబ్‌డెస్క్: బనకచర్ల ప్రాజెక్టు(Banakacherla Project) విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), నీటిపారుదలశాఖ(Irrigation Department) మంత్రి ఏం చేస్తున్నారని బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్యేలు హరీష్ రావు(Harish Rao), కేటీఆర్(KTR) ప్రశ్నల వర్షం కురిపించారు. బనకచర్లతో తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా.. హరీష్ రావు, కేటీఆర్‌ల ఆరోపణలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) కౌంటర్ ఇచ్చారు. శుక్రవారం ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. బనకచర్ల ప్రాజెక్టును తాము అంగీకరించట్లేదని ఖరాఖండీగానే చెప్పామని అన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో జరిగిన పొరపాట్లను సరిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.

బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో నదీజలాల విషయంలో చాలా నష్టం జరిగిందని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాక నష్టం తగ్గించే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. బనకచర్ల ప్రాజెక్టు విషయంలోనూ అప్రమత్తంగానే ఉన్నామని స్పష్టం చేశారు. అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేంద్ర జల్‌శక్తి(Central Hydropower), ఆర్థిక మంత్రులకు ఇప్పటికే లేఖలు రాసినట్లు తెలిపారు. నిర్మలా సీతారామన్‌(Nirmala Sitharaman)కు రాసిన లేఖ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. కృష్ణా జలాల్లో 70 శాతం వాటా తెలంగాణకు ఇవ్వాలని 2015లోనే కోరినట్లు తెలిపారు. కానీ బీఆర్ఎస్ మాత్రం 299 టీఎంసీలు చాలని ఒప్పుకున్నదని గుర్తుచేశారు. నాటి బీఆర్ఎస్ నిర్ణయంతో తెలంగాణకు రావాల్సిన కృష్ణా జలాల్లో నష్టం జరిగేలా చేశారని అన్నారు.

బనకచర్ల ప్రాజెక్టు(Banakacherla Project) విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే హరీష్‌రావు పచ్చి అబద్ధాలు చెప్పారని మంత్రి ఉత్తమ్‌ అన్నారు. బీఆర్ఎస్ పాలన పుణ్యమా? అని ఇరిగేషన్‌శాఖ కోలుకోలేని స్థితికి వెళ్లిందని తెలిపారు. రూ.లక్ష కోట్ల అప్పుతెచ్చి కాళేశ్వరం కట్టారని మండిపడ్డారు. ఎవరిని అడిగినా క్వాలిటీ లేదని చెబుతున్నారని గుర్తుచేశారు. గోదావరి నీటి విషయంలో ఇష్టానుసారం మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 200 టీఎంసీలు ఏపీకి తీసుకెళ్తున్నారని అంటున్నారు.. ప్రాజెక్ట్‌లో చుక్క నీరు కూడా బయటికి పోలేదని స్పష్టం చేశారు.

Next Story