Kavitha: రేవంత్ రెడ్డి అవినీతి చక్రవర్తి.. ఆయనకు ఆ బిరుదే కరెక్ట్.. కవిత సంచలన వ్యాఖ్యలు

by Prasad Jukanti |   (  Updated:2025-06-26 07:24:49  IST  )

చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా మాట్లాడేందుకు భయపడి రేవంత్ రెడ్డి బనకచర్లపై సైలెంట్ అయ్యారని కవిత విమర్శించారు.

Kavitha: రేవంత్ రెడ్డి అవినీతి చక్రవర్తి.. ఆయనకు ఆ బిరుదే కరెక్ట్.. కవిత సంచలన వ్యాఖ్యలు
X

దిశ,తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు (CM Chandrababu Naidu) వ్యతిరేకంగా మాట్లాడేందుకు భయపడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బనకచర్లపై సైలెంట్ అయ్యారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (MLC Kavitha) విమర్శించారు. రేవంత్ రెడ్డి, చంద్రబాబు భేటీ తర్వాత బనకచర్లకు (Banakacharla) గ్రీన్ సిగ్నల్ వచ్చిందని జూలై 6వ తేదీకి తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ జరిగి సంవత్సరం అవుతుందన్నారు. చంద్రబాబుకు రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) హైదరాబాద్ బిర్యానీ తినిపించి బనకచర్ల నీళ్లను అప్పగిస్తున్నారని ఆరోపించారు. ఆంధ్రా బిర్యానీ (Andhra Biryani) ఎట్లా ఉంటుందో కేసీఆర్ గతంలోనే చెప్పారని అన్నారు. ఇవాళ జూబ్లీహిల్స్ జాగృతి కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కవిత తెలంగాణ ప్రజలకు బోనాల శుభాకాంక్షలు తెలిపారు. బనకచర్ల ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆంధ్రాలో మేధావులు మీటింగ్ పెట్టారని మెగా కంపెనీకి లబ్ది చేసేందుకు బనకచర్లను కడుతున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ కలలో కూడా తెలంగాణకు నష్టం చేయరన్నారు.

రేవంత్ రెడ్డి అవినీతి చక్రవర్తి:

రేవంత్ రెడ్డికి అవినీతి చక్రవర్తి అనే బిరుదు ఇస్తున్నామని రేవంత్ రెడ్డి అవినీతిపై జాగృతి ఆధ్వర్యంలో బుక్ లెట్ ప్రచురించి రాష్ట్ర వ్యాప్తంగా పంచుతామని కవిత చెప్పారు. 18 నెలల పరిపాలన కాలంలో రెండు లక్షల కోట్లు అప్పులు తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు.. 2లక్షల కోట్ల రూపాయల అప్పులపై సీఎం రేవంత్ రెడ్డి శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మేము అప్పులు తెచ్చి కేసీఆర్ చేసిన అప్పులకు వడ్డీ కడుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. కానీ రెండు లక్షల కోట్లు అప్పులు చేసినా పింఛన్లు ఇవ్వడం లేదు, మహాలక్ష్మి పధకం అమలు చేయడం లేదని ధ్వజమెత్తారు. కేసీఆర్ ఆర్ఈసీ వద్ద అప్పులు తెచ్చి ప్రాజెక్టులు కట్టారు. తెచ్చిన అప్పులను కేసీఆర్ తిరిగి కట్టారన్నారు. ఆర్ఈసీ సంస్థ కేసీఆర్ ప్రభుత్వానికి ఏ గ్రేడ్ ఇచ్చిందని గుర్తు చేశారు. ఆర్ఈసీ సంస్థకు మీరు కట్టాల్సిన డబ్బులు కట్టడం లేదని రాష్ట్ర ప్రభుత్వానికి 2024లో లేఖ రాశారు. జూన్ 28లోపు కట్టాల్సిన రూ.1,320 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కట్టాలని ఆర్ఈసీ సంస్థ మరో లేఖ రాసిందని లేకపోతే ప్రభుత్వాన్ని డిఫాల్ట్ గా చూపుతామని హెచ్చరించిందన్నారు.

8 మంది బీజేపీ ఎంపీలు నోరెత్తడంలేదు:

కేంద్ర ప్రభుత్వం ప్రగతి అజెండాలో పోలవరం ప్రాజెక్టు చర్చను ఎత్తివేశారని కవిత విమర్శించారు. భద్రాచలం రాముడు మునుగుతున్నా తెలంగాణలో ఉన్న 8 మంది బీజేపీ ఎంపీలు నోరెత్తడంలేదని దుయ్యబట్టారు. భద్రాచలం దగ్గర ఐదు గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేశారు. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ మెగా,పొంగులేటి కంపెనీలు దక్కించుకున్నాయని. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ప్రారంభం కాకముందే కంపెనీలకు అడ్వాన్స్ లు ఇచ్చారని ఆరోపించారు.

Next Story