Banakacharala : బనకచర్ల వివాదం... తెలుగు రాష్ట్రాల సీఎంలకు కేంద్రం పిలుపు

by Muthe.Rajitha |   (  Updated:2025-07-14 13:05:25  IST  )

ఏపీ, తెలంగాణ మధ్య నెలకొన్న బనకచర్ల ప్రాజెక్టు వివాదం ఢిల్లీకి చేరిన విషయం తెలిసిందే.

Banakacharala : బనకచర్ల వివాదం... తెలుగు రాష్ట్రాల సీఎంలకు కేంద్రం పిలుపు
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ, తెలంగాణ మధ్య నెలకొన్న బనకచర్ల ప్రాజెక్టు వివాదం ఢిల్లీకి చేరిన విషయం తెలిసిందే. ఈ వివాదంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనుంది. బనకచర్ల ప్రాజెక్టు ప్రతిపాదనలు, తెలంగాణ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానుంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించామని కేంద్ర జలశక్తిశాఖ మంత్రి సీఆర్ పాటిల్ ఇరు రాష్ట్రాలకు లేఖ రాశారు. ఈ సమావేశానికి రావడానికి వీలవుతుందో లేదో చెప్పాలని లేఖలో పేర్కొంది. ఈ క్రమంలో ఇరు రాష్ట్రాల సీఎంలు ఎల్లుండి ఢిల్లీలో భేటీ అయ్యే అవకాశం ఉందని సమాచారం.

Next Story