‘NO FLY ZONE’ సచివాలయం పరిసరాల్లో డ్రోన్ల ఎగరవేతపై నిషేధం

by Ramesh Naini |

రాష్ట్ర సచివాలయం పరిసర ప్రాంతాల్లో డ్రోన్లకు ‘నో ఫ్లై జోన్’ గా ప్రకటించింది.

‘NO FLY ZONE’ సచివాలయం పరిసరాల్లో డ్రోన్ల ఎగరవేతపై నిషేధం
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర సచివాలయం (Telangana Secretariat) పరిసర ప్రాంతాల్లో (drones) డ్రోన్లకు ‘నో ఫ్లై జోన్’ గా ప్రకటించింది. ఈ మేరకు ఆర్ & బీ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సచివాలయం చుట్టూ డ్రోన్ల ఎగరవేత పూర్తిగా నిషేధం కానుంది. ఇందుకోసం ప్రత్యేకంగా “NO FLY ZONE FOR DRONES” అనే సైన్‌బోర్డులు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బతుకమ్మ పండుగ వేడుకల సందర్భంగా భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Next Story