Balmuri Venkat: సీఎం పై అనుచిత వ్యాఖ్యలు.. కేటీఆర్, కౌశిక్‌రెడ్డిపై కాంగ్రెస్ ఫిర్యాదు

by Prasad Jukanti |

కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డిపై సైబర్ పోలీసులకు కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు.

Balmuri Venkat: సీఎం పై అనుచిత వ్యాఖ్యలు.. కేటీఆర్, కౌశిక్‌రెడ్డిపై కాంగ్రెస్ ఫిర్యాదు
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: సీఎం రేవంత్‌రెడ్డిపై (CM Revanth Reddy) అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR), ఆ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై (Padi Kaushik Reddy) చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ (Balmuri Venkat) పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిన్న కాళేశ్వరం కమిషన్ ఎదుట కేసీఆర్ హాజరయ్యే సందర్భంలో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ రేవంత్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, సామాజిక మాధ్యమాల్లో పాడి కౌశిక్‌రెడ్డి అనుచిత పోస్టులు పెట్టారని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో కౌశిక్‌రెడ్డి చేసిన పోస్టులు ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా అభ్యంతరకరంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇటువంటి చర్యలు ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన నాయకుడిని కించపరచడమే కాకుండా ప్రజల్లో రాజకీయాల్లో సున్నితమైన వాతావరణానికి భంగం కలిగించడమే అవుతుందన్నారు. ఈ పోస్టులు సీఎంను ఉద్దేశపూర్వకంగా కించపరచడమే కాకుండా పరువు నష్టం కలిగించేలా ఉన్నాయని, ఈ విషయంలో చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

Next Story