- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాంట్రాక్టర్లను హరీష్ రావు బెదిరిస్తున్నారు: బల్మూర్ వెంకట్
హ్యామ్ రోడ్ల కాంట్రాక్టర్లకు ఫోన్ చేసి హరీష్ రావు బెదిరిస్తున్నారని, కాంట్రాక్టర్లను బ్లాక్ మెయిల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని ప్రభుత్వ విప్, బల్మూర్ వెంకట్ ఆరోపించారు. నిబంధనల ప్రకారం టెండర్ ప్రక్రియ కొనసాగుతోందని, గత ప్రభుత్వ హయాంలో బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు టెండర్లకు ముందుకు రాలేదన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో : హ్యామ్ రోడ్ల కాంట్రాక్టర్లకు ఫోన్ చేసి హరీష్ రావు బెదిరిస్తున్నారని, కాంట్రాక్టర్లను బ్లాక్ మెయిల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని ప్రభుత్వ విప్, బల్మూర్ వెంకట్ ఆరోపించారు. నిబంధనల ప్రకారం టెండర్ ప్రక్రియ కొనసాగుతోందని, గత ప్రభుత్వ హయాంలో బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు టెండర్లకు ముందుకు రాలేదన్నారు. హరీష్ రావు బ్లాక్ మెయిల్ రావుగా మారారని, బావా, బామ్మర్థి పోటీలు పడి మరీ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆయన ఆరోపణలు గుప్పించారు. శనివారం సీఎల్పీ మీడియా సెంటర్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పదేళ్లు బ్లాక్ మెయిల్ చేసి అడ్డగోలుగా అవినీతికి పాల్పడ్డారని, కాంట్రాక్టర్లను ఎలా బెదిరించి డబ్బులు వసూలు చేయాలన్నదే ఆయన ఆలోచన అని ఆరోపించారు. మీ కుటుంబంలోని మహిళనే ప్రతి రోజు ఏడిపిస్తున్నారని, కవిత ఆరోపణలకు సమాధానం ఇవ్వని మీరు మా ప్రభుత్వాన్ని విమర్శిస్తారా అని బల్మూర్ వెంకట్ నిలదీశారు. కేసీఆర్ కుర్చీలో కూర్చోవాలన్నదే కేటీఆర్, హరీష్ రావు ఆలోచన అని, కేటీఆర్, హరీష్ రావులు ప్రజా సమస్యలపైన మా దగ్గరకు వస్తే సీఎంని కలిపిస్తామన్నారు. అడ్డగోలుగా మాట్లాడితే తెలంగాణ ప్రజలు మీకు బుద్ది చెప్తారని బల్మూర్ వెంకట్ విమర్శించారు.
హరీష్ రావు కాదు బ్లాక్ మెయిల్ రావు ...అసెంబ్లీలో క్రషర్ల అంశంపైన మాట్లాడి వాటి యజమానులను బ్లాక్ మెయిల్ చేశారు : ప్రభుత్వ విప్, అద్దంకి దయాకర్
హరీష్ రావు కాదు బ్లాక్ మెయిల్ రావు అని, అసెంబ్లీలో క్రషర్ల అంశంపైన మాట్లాడి వాటి యజమానులను బ్లాక్ మెయిల్ చేశారని ప్రభుత్వ విప్, అద్దంకి దయాకర్ ఆరోపించారు. క్రషర్ల యజమానుల నుంచి ఎమ్మెల్సీ నవీన్ రావు మధ్యవర్తిగా కోటీ రూపాయల చొప్పున వసూలు చేశారని, క్రషర్ల యజమానుల నుంచి డబ్బులు తీసుకోలేదని హరీష్ రావు ప్రమాణం చేయాలని అద్దంకి దయాకర్ సవాల్ విసిరారు. సీఎల్పీ మీడియా సెంటర్ లో శనివారం మీడియాతో మాట్లాడుతూ హ్యామ్ రోడ్ల పైన మాట్లాడి కాంట్రాక్టర్లను లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నారని, హామ్ రోడ్ల టెండర్ల పైన ఇంకా నిర్ణయం తీసుకోలేదని, అప్పుడే అవీనీతి జరిగిందని కొందరు మాట్లాడుతున్నారని ఆయన ఫైర్ అయ్యారు. హరీష్ రావు దందాలు అన్ని బయటకు వస్తాయని, హరీష్ రావు దగ్గర ఆధారాలు ఉంటే చర్చకు రావాలి.. మేం సిద్ధంగా ఉన్నామని అద్దంకి దయాకర్ స్పష్టం చేశారు. అధికారులను బెదిరించడం చేతకాని దద్దమ్మలు చేసే పనులని, ఏదో ఒక అంశంపైన మాట్లాడటం, వాళ్లను బ్లాక్ మెయిల్ చేయడమే బీఆర్ఎస్ నేతల పని అని ఆయన ఆరోపణలు గుప్పించారు. ప్రతిపక్షంలో కూడా సంపాదించాలన్నదే వారి ఆలోచన అని, హరీష్ రావు వసూల్ రావు అయ్యారని ఆయన మండిపడ్డారు. కల్వకుంట్ల కుటుంబం నటనకు ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చని, శకుని వ్యవహారాలు హరీష్ రావు, కేటీఆర్ లు మానుకోవాలని అద్దంకి దయాకర్ హితవు పలికారు. కల్వకుంట్ల కుటుంబంలోని నలుగురి చర్యల వెనక ఆర్థిక లాభమే ఉంటుందని, మాది ప్రజా ప్రభుత్వం, తప్పులు జరగనివ్వమన్నారు. లక్షల కోట్లు దోచుకున్నా ఇంకా డబ్బులపైనే యావ.. బ్లాక్ మెయిలే పని అని అద్దంకి దయాకర్ విమర్శలు గుప్పించారు.






