నిరుద్యోగులు బీఆర్ఎస్ ట్రాప్‌లో పడొద్దు.. గ్రూప్-1పై ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |

నిరుద్యోగులు బీఆర్ఎస్ నేతల ట్రాప్‌లో పడి ఆగం కావొద్దని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సూచించారు. రానున్న నోటిఫికేషన్ల కోసం సన్నద్దం కావాలని ఆయన కోరారు.

నిరుద్యోగులు బీఆర్ఎస్ ట్రాప్‌లో పడొద్దు.. గ్రూప్-1పై ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: (unemployed people) నిరుద్యోగులు బీఆర్ఎస్ (BRS) నేతల ట్రాప్‌లో పడి ఆగం కావొద్దని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ (Balmoor Venkat) సూచించారు. రానున్న నోటిఫికేషన్ల కోసం సన్నద్దం కావాలని ఆయన కోరారు. గ్రూప్-1 పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ నేతలు, అభ్యర్థులను, పేరెంట్స్‌ను మానసిక క్షోభకు గురిచేశారని, వాళ్లను రోడ్ల మీదకు తీసుకొచ్చారని ఆరోపించారు. గతంలో పేపర్లు లీక్ చేసి, నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారని, ఇప్పుడు మళ్లీ నిరుద్యోగులను రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. గ్రూప్ 1 పరీక్ష అంటే తెలియని పాడి కౌశిక్ రెడ్డి కూడా ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. వాస్తవాలు ఉంటే.. చట్టపరంగా ఎదుర్కోవాలని, అవాస్తవాలను ప్రచారం చేసి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవద్దని సూచించారు.

గత పదేళ్లు అధికారంలో ఉండి ఒక (Group 1) గ్రూప్-1 పరీక్ష నిర్వహించలేకపోయారని విమర్శించారు. నిర్వహించిన పరీక్షలపై అవకతవకలు జరిగితే నేనే స్వయంగా.. నాడు నిరుద్యోగుల పక్షాన పోరాటం చేసి, ఆధారాలతో సహా నిరూపించామని చెప్పారు. పదేళ్లు విద్యార్థి నాయకుడిగా, నిరుద్యోగుల సమస్యలపై అవగాహన ఉందని, నిరుద్యోగుల విషయంలో ఏ పార్టీ నాయకులు మాట్లాడినా.. ఆలోచించి మాట్లాడితే బాగుంటుందని హితువు పలికారు.

నిరుద్యోగుల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. అదే సమయంలో నిరుద్యోగులకు రావాల్సిన నోటిఫికేషన్ల విషయంలో ప్రభుత్వం ఆలోచన చేస్తోందని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల ఉండటంతో నోటిఫికేషన్లు ఆలస్యం అవుతున్నాయిని స్పష్టం చేశారు. అదే సమయంలో ఇబ్బంది లేని డిపార్ట్‌మెంట్‌లలో నోటిఫికేషన్లు ఇస్తున్నామన్నారు. మీలో వ్యక్తిగా నిరుద్యోగుల బాగు కోసం ఆలోచించే వ్యక్తిని.. నిజంగా మీకు అన్యాయం జరిగినప్పుడు మీ కోసం కొట్లాడేందుకు ముందుంటా అని భరోసా ఇచ్చారు.

Next Story