ఇప్పటికైనా.. తాగింది దిగి తప్పు తెలుసుకున్నావ్.. నటుడు శ్రీకాంత్ క్షమాపణపై స్పందించిన బల్మూరి వెంకట్

by Ramesh Naini |

మహాత్మా గాంధీపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే.

ఇప్పటికైనా.. తాగింది దిగి తప్పు తెలుసుకున్నావ్.. నటుడు శ్రీకాంత్ క్షమాపణపై స్పందించిన బల్మూరి వెంకట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: మహాత్మా గాంధీపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే. ఆయన క్షమాపణలు చెప్పడంపై కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ (Balmoor Venkat) స్పందించారు. బల్మూరి వెంకట్ ట్వీట్ చేస్తూ.. ‘ఇప్పటికైనా.. తాగింది దిగి చేసిన తప్పు తెలుసుకున్నావ్.. అలాగే మన స్వాతంత్ర్య సమరయోధులను కించపరిచే విధంగా మాట్లాడిన అన్ని పోస్టులు డిలీట్ చేసి మళ్లీ ఈ తప్పు జరగకుండా చూసుకో.. ఇక నుంచి అయినా సోషల్ మీడియాను మంచికి వాడు.. విద్వేషాలు రెచ్చగొట్టడానికి కాదు.. మన ఫ్రీడమ్ ఫైటర్స్ పైన సోషల్ మీడియా వేదికగా ఇష్టం వచ్చినట్లు మాట్లాడే వాళ్ళందరూ ఇదొక ఉదాహరణగా తీసుకుని ఇలాంటి దుశ్చర్యలు మానుకోవాలి’ అని బల్మూరి వెంకట్ ట్వీట్‌లో పేర్కొన్నారు. ట్వీట్ ఇదే..

కాగా, మహాత్మ గాంధీ (Mahatma Gandhi)పై నటుడు శ్రీకాంత్ అయ్యంగార్‌ (Srikanth Iyengar) చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ అంశాన్ని తెలంగాణ కాంగ్రెస్‌ కూడా సీరియస్‌గా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే శ్రీకాంత్ అయ్యంగార్‌పై కేసులు నమోదు చేసింది. మరోవైపు ఆదివారం ఉదయం ‘మా’ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణును కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కలిసి ఫిర్యాదు చేశారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన శ్రీకాంత్ అయ్యంగార్‌ ‘మా’ సభ్యత్వం రద్దు చేయడంతో పాటు ఆయనపై చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ ఇచ్చారు. ఈ వరుస పరిణామాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ తాజాగా స్పందించి క్షమాపణలు చెబుతూ ఒక వీడియో విడుదల చేశారు.

అలాగే ఇటీవల తాను పెట్టిన సోషల్ మీడియా పోస్టులపై కూడా వివరణ ఇచ్చారు. నా వ్యాఖ్యలు వల్ల చాలామంది మనోభావాలు దెబ్బతిన్నాయని తెలిసింది. అందుకే అందరికీ క్షమాపణ చెబుతున్నా.. అని పేర్కొన్నారు. భవిష్యత్‌లో ఇలాంటివి మళ్లీ రిపీట్ కాకుండా జగ్రత్తలు తీసుకుంటానని అన్నారు. అందరం కలిసి దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం అవుదామని పిలుపునిచ్చారు.

Next Story