హరీష్ రావుకు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కౌంటర్

by Ajay Maddhiboyina |

కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన జాబ్ క్యాలెండర్‌లో ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదని మాజీ మంత్రి హ‌రీష్ రావు ప్ర‌భుత్వం విమ‌ర్శ‌లు గుప్పించిన సంగ‌తి తెలిసిందే.

హరీష్ రావుకు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కౌంటర్
X

దిశ‌, వెబ్ డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన జాబ్ క్యాలెండర్‌లో ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదని మాజీ మంత్రి హ‌రీష్ రావు ప్ర‌భుత్వం విమ‌ర్శ‌లు గుప్పించిన సంగ‌తి తెలిసిందే. హ‌రీష్ రావు వ్యాఖ్య‌లకు ఎమ్మెల్సీ బ‌ల్మూరి వెంక‌ట్ కౌంట‌ర్ వేశారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న‌ప్పుడు బీఆర్ఎస్ ప్ర‌జ‌ల‌ను, విద్యార్థుల‌ను మోసం చేసింద‌న్నారు. నిరుద్యోగులు ఉద్యోగాల భ‌ర్తీ గురించి అడిగినా వాళ్ల‌ను హేళ‌న చేశార‌న్నారు. బీఆర్ఎస్ హ‌యాంలో ఉద్యోగాల భ‌ర్తీలో జ‌రిగిన అవ‌క‌త‌వ‌క‌ల‌ను త్వ‌ర‌లోనే బ‌య‌ట‌పెడ‌తామ‌ని అన్నారు. ఇంటికో ఉద్యోగం అని చెప్పి, తాను వాగ్దానం చేయ‌లేద‌ని అసెంబ్లీలో మాట్లాడార‌ని చెప్పారు. ద‌ళితుడిని సీఎం చేస్తామ‌ని హామీ ఇచ్చి మోసం చేశారని మండిప‌డ్డారు.

Next Story