జూబ్లీహిల్స్‌లో ఓట‌మిని అంగీక‌రించిన కేటీఆర్.. ఎమ్మెల్సీ బ‌ల్మూరి వెంక‌ట్ సంచలన వ్యాఖ్యలు

by Ramesh Naini |

జూబ్లీహిల్స్‌లో ఓట‌మిని కేటీఆర్ అంగీక‌రించారని కాంగ్రెస్​ ఎమ్మెల్సీ బ‌ల్మూరి వెంక‌ట్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

జూబ్లీహిల్స్‌లో ఓట‌మిని అంగీక‌రించిన కేటీఆర్.. ఎమ్మెల్సీ బ‌ల్మూరి వెంక‌ట్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్ వర్కింగ్​ ప్రెసిడెంట్ ​కేటీఆర్‌(KTR)కు జూబ్లీహిల్స్ ప్రజ‌ల నాడి తెలిసిపోయిందని, (Jubilee Hills) జూబ్లీహిల్స్‌లో ఓట‌మిని కేటీఆర్ అంగీక‌రించారని కాంగ్రెస్​ ఎమ్మెల్సీ బ‌ల్మూరి వెంక‌ట్ (Balmoor Venkat) సంచలన వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ అభ్యర్థి వంద‌శాతం ఘ‌న‌విజ‌యం సాధించ‌బోతున్నారని, కేటీఆర్ ఓట‌మి నెపాన్ని నెట్టి వేయ‌డానికి ఓట‌ర్ల జాబితాలో అవ‌క‌త‌వ‌కలు జ‌రిగాయ‌ని మాట్లాడుతున్నారని బల్మూరి వెంకట్ ​విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్‌కు చేత‌కాక ఓటు చోరీ అంటూ అడ్డగోలుగా నోటి కొచ్చిన‌ట్లుగా మాట్లాడుతున్నారని, ఆయన చెపుతున్న ఓట‌ర్ల జాబితా 2023 లోనే త‌యారు అయిందని, రాష్ట్ర ఎన్నిక‌ల సంఘ‌మే ఈ విష‌యాన్ని తేల్చిందన్నారు.

ఓట‌ర్ లిస్ట్ రూపొందించేది కాంగ్రెస్​ పార్టీ కాదని, ఓట‌ర్ల జాబితాలో ఏమైనా త‌ప్పులు ఉంటే ఈసీకి ఆధారాలు ఇస్తే స‌రిపోతుందని ఎమ్మెల్సీ వెంకట్​ చెప్పారు. ఈ విష‌యం తెలిసి కూడా ప‌దేళ్లు మంత్రిగా ప‌నిచేసిన కేటీఆర్ బుర‌ద జ‌ల్లే ప్రయ‌త్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప్రజ‌లు కొట్టిన పంచ్‌కు కేసీఆర్ గ‌జ్వేల్ ఫామ్ హౌస్‌లో ప‌డ్డారని, దొంగ‌ మాటలు చెప్పి డ్రామాలు ఆడుతున్న కేటీఆర్‌ను ప్రజ‌లు చెప్పుల‌తో కొట్టే రోజులు రాబోతున్నాయని ధ్వజమెత్తారు. గ‌తంలో ఉప ఎన్నిక‌లు వ‌చ్చిన‌ప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఎలా వ్యవ‌హారించిందో ప్రజ‌ల‌కు తెలుసని, ఉప ఎన్నిక‌ల స‌మ‌యంలో కొత్త ప‌థ‌కాలు తీసుకువ‌చ్చి ప్రజ‌ల‌ను మోసం చేసిన చ‌రిత్ర ఆ పార్టీదని ఎమ్మెల్సీ వెంకట్​ ఆరోపించారు.

Next Story