- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైదరాబాద్ వాసులకు అలర్ట్.. బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం.. ఈ రూట్లు బంద్..
ప్రతి ఏడాది ఆషాఢ మాసం మొదటి మంగళవారం బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ ఉత్సవం నిర్వహిస్తారు.

దిశ, ఖైరతాబాద్ : ప్రతి ఏడాది ఆషాఢ మాసం మొదటి మంగళవారం బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ ఉత్సవం నిర్వహిస్తారు. ఈ అమ్మవారి కల్యాణోత్సవానికి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న భక్తులు వస్తారు. వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. మూడు రోజులపాటు వేడుకల సందర్భంగా ఈ ప్రాంతంలో ట్రాఫిక్ దారి మళ్లింపులు చేపట్టారు పోలీసులు. ప్రధానంగా బల్కంపేట వైపుగా వెళ్తున్న వాహనదారులకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు బిగ్ అలర్ట్ జారీ చేశారు. జూలై 1న ఎల్లమ్మ కళ్యాణం ఉత్సవం సందర్భంగా ట్రాఫిక్ రూటు మార్పులు ఉంటాయి. ఇక 2వ తేదీ కూడా రథోత్సవం నిర్వహిస్తారు. ప్రధానంగా ట్రాఫిక్ లో ఎక్కడెక్కడ రూటు మళ్లించారు తెలుసుకుందాం.
రూట్ మ్యాప్ :
గ్రీన్ ల్యాండ్, మాత టెంపుల్, సత్యం థియేటర్ నుంచి ఫతేనగర్ వైపు వెళ్తున్న వాహనాలు ఎస్ఆర్ నగర్ టీ జంక్షన్ మీదుగా.. ఎస్సార్ నగర్ కమ్యూనిటీ హాల్ అభిలాష టవర్- బి కే గూడ క్రాస్ రోడ్ నుంచి శ్రీరామ్ నగర్ క్రాస్ రోడ్ నుంచి సనత్ నగర్ లేదా ఫతేనగర్ వైపుగా వెళ్ళవచ్చు…
ఫతేనగర్ ఫ్లైఓవర్ నుంచి బల్కంపేట వైపుగా వెళ్తున్న వాహనాలు బేగంపేట్ కట్ట మైసమ్మ టెంపుల్ వద్ద నిర్మించిన కొత్త బ్రిడ్జి నుంచి రూటు మళ్లించారు. గ్రీన్ ల్యాండ్ బకుల్ అపార్ట్మెంట్స్ నుంచి ఫుడ్ వరల్డ్ వైపుగా వస్తున్న వాహనాలు కూడా బల్కంపేట మీదుగా వెళ్ళకూడదు. అక్కడి నుంచి సోనాబాయ్ టెంపుల్ నుంచి సత్యం థియేటర్ మైత్రివనం వైపుగా వెళ్లాల్సి ఉంటుంది…
బేగంపేట కట్ట మైసమ్మ టెంపుల్ నుంచి బల్కంపేట వైపుగా వస్తున్న వాహనాలు కూడా గ్రీన్ ల్యాండ్ నుంచి మాత టెంపుల్ సత్యం థియేటర్ ఎస్ ఆర్ నగర్ టీ జంక్షన్ వద్ద లెఫ్ట్ తీసుకొని ఎస్ఆర్ నగర్ కమ్యూనిటీ హాల్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ ఇతర లేన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. తద్వారా ఎస్సార్ నగర్ వైపు లేదా ఫతేనగర్ వైపు వెళ్ళవచ్చు. నేరుగా ఎస్ ఆర్ నగర్ టీ జంక్షన్ నుంచి ఫతేనగర్ మాత్రం వెళ్లే రూట్లో బంద్ ఉంటాయి.
వాహనాలకు పార్కింగ్ :
ఎల్లమ్మ కళ్యాణ ఉత్సవానికి వచ్చిన వాహనాలకు పార్కింగ్ సదుపాయాలు కూడా కల్పించారు. ఆర్ అండ్ బీ ఆఫీస్ జీహెచ్ఎంసి గ్రౌండ్, పద్మశ్రీ నుంచి నేచర్ క్యూర్ హాస్పిటల్ రోడ్డు వెళ్తున్నవారు ఫతేనగర్ అండర్ రైల్వే బ్రిడ్జి నేచర్ క్యూర్ హాస్పిటల్ ఈ ప్రాంతాలలో వాహనాలు నిలుపుకోవచ్చు.
బల్కంపేట వైపుగా వస్తున్న ఈ వాహనదారులు తప్పకుండా ఈ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే వెంటనే ట్రాఫిక్ హెల్ప్ లైన్ నెంబర్ 9010203626 కి కాల్ చేయాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ఇక సోషల్ మీడియా పేజీ అయితే ప్లాట్ ఫామ్ (facebook.com/HYDTP), @HYDP ట్విట్టర్ పేజీలో సహాయం పొందవచ్చని, వాహనదారులు సహకరించాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కోరారు.






