- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG Govt: బల్కంపేట దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఏర్పాటు
బోనాల పండుగ వేళ రాష్ట్ర ప్రభుత్వం(Congress Government) కీలక నిర్ణయం తీసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: బోనాల పండుగ వేళ రాష్ట్ర ప్రభుత్వం(Congress Government) కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లోని బల్కంపేట ఎల్లమ్మ-పోచమ్మ దేవస్థానం ట్రస్ట్ బోర్డును(Balkampet Temple Trust Board) ఏర్పాటు చేసింది. మొత్తం 13 మంది సభ్యులతో ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేస్తూ దేవాదాయశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
కాగా, మరోవైపు తెలంగాణ ప్రజలు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకునే బోనాల(Bonala Jathara) ఉత్సవాలు గురువారం ప్రారంభం అయ్యాయి. ఆషాఢమాసం బోనాల జాతర గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున తొలి బోనం సమర్పించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు అనంతరం రాష్ట్ర ప్రభుత్వం దీనిని అధికారిక పండుగగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ యేడాది బోనాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆలయాలకు నిధులు కూడా కేటాయించింది.






