- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భక్తులను ఫిదా చేస్తున్న బాలాపూర్ గణేష్
బాలాపూర్ వినాయకుడు ఎంత ఫేమస్సో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ఇక్కడ లడ్డూ లక్షల్లో వేలం పాట పలుకుతుంది. ప్రతిఏడాది సరికొత్త మండపాలు, డిజైన్లతో వార్తల్లో నిలుస్తుంటాడు.

దిశ, వెబ్ డెస్క్: బాలాపూర్ వినాయకుడు ఎంత ఫేమస్సో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ఇక్కడ లడ్డూ లక్షల్లో వేలం పాట పలుకుతుంది. ప్రతిఏడాది సరికొత్త మండపాలు, డిజైన్లతో వార్తల్లో నిలుస్తుంటాడు. కాగా ఈ ఏడాది బాలాపూర్ గణేషుడి మండపాన్ని సర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం నమూనాలో ఏర్పాటు చేశారు. రూ.2 కోట్లతో ఈ ఆలయ సెట్ వేసినట్టు తెలుస్తోంది. అచ్చం స్వర్ణగిరి ఆలయం మాధిరిగా ఉన్న నమూనా భక్తులను ఎంతగానో ఆకర్షిస్తోంది.
దీంతో పెద్ద ఎత్తున భక్తులు బాలాపూర్ గణేషుడిని దర్శించుకునేందుకు వస్తున్నారు. ఇదిలా ఉంటే బాలాపూర్ వినాయకుడికి 46 ఏళ్ల చరిత్ర ఉంది. 1980 ఒక అడుగుతో బాలాపూర్ గణేషుడిని ప్రారంభించగా ఈ ఏడాది 22 అడుగులకు చేరింది. అంతే కాకుండా ఇక్కడ 1994లో లడ్డూ వేలం పాట ప్రారంభగా గతేడాది ముప్లై లక్షల ఒక వెయ్యి రూపాయలకు అమ్ముడుపోయింది. ప్రతిఏడాది బాలాపూర్ లడ్డూ వేలం పాటను మీడియాలో లైవ్ ఇస్తారంటే దీనికి ఎంత ప్రాధాన్యత ఉందో అర్థం చేసుకోవచ్చు.






