తెలంగాణ CM సహాయనిధికి బాలకృష్ణ భారీ విరాళం

by Gantepaka Srikanth |   (  Updated:2025-08-30 16:16:58  IST  )

నటసింహం నందమూరి బాలకృష్ణ(Balakrishna) మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. తెలంగాణ వరద బాధితులకు భారీ ఆర్థికసాయం చేశారు.

తెలంగాణ CM సహాయనిధికి బాలకృష్ణ భారీ విరాళం
X

దిశ, వెబ్‌డెస్క్: నటసింహం నందమూరి బాలకృష్ణ(Balakrishna) మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. తెలంగాణ వరద బాధితులకు భారీ ఆర్థికసాయం చేశారు. ఈ మేరకు తెలంగాణ సీఎం సహాయనిధి(Telangana CM Relief Fund)కి బాలకృష్ణ రూ.50 లక్షల విరాళం ప్రకటించారు. కాగా, ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలు ఉత్తర తెలంగాణను ముంచెత్తాయి. ఈ భారీ వర్షాల వల్ల 10 మంది వరకు చనిపోయి ఉండొచ్చని తెలంగాణ డీజీపీ జితేందర్ అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై పూర్తి అప్రమత్తంగా ఉన్నట్టు చెప్పారు. ఇప్పటి వరకు వరదల్లో చిక్కుకున్న దాదాపు 2వేల మందిని రక్షించినట్టు చెప్పారు. ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌, ఆర్మీ సాయంతో రెండు హెలికాప్టర్ల ద్వారా బాధితులను రక్షించినట్టు డీజీపీ వివరించారు. సహాయక చర్యల కోసం డయల్‌ 100కు కాల్‌ చేయాలని సూచించారు.

Next Story