- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బలగం సినిమా రిపీట్.. పదేళ్ల తర్వాత ఒక్కటయ్యారు!
టాలీవుడ్ కమెడియన్ ప్రియదర్శి ప్రధాన పాత్రలో డైరెక్టర్ వేణు తెరకెక్కించిన 'బలగం' సినిమా బంధుత్వాల విలువను చాటిచెప్పిందనటంలో అతిశయోక్తి లేదు.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ కమెడియన్ ప్రియదర్శి ప్రధాన పాత్రలో డైరెక్టర్ వేణు తెరకెక్కించిన 'బలగం' (Balagam) సినిమా బంధుత్వాల విలువను చాటిచెప్పిందనటంలో అతిశయోక్తి లేదు. ఈ సినిమాలో తండ్రి చనిపోయాక తోబుట్టుల మధ్య విబేధాలు తల్లెత్తి ఎలా విడిపోయారు.. చివరికి తండ్రి పెద్ద కర్మ రోజు వారి మధ్య ఉన్న జ్ఞాపకాలను గుర్తుచేసుకుని ఎలా కలిసిపోతారనేది డైరెక్టర్ ఎంతో ఎమోషనల్‌గా చూపించారు. ఈ సన్నివేశాలు నిజ జీవితంలో ఎంతో మందికి కనెక్ట్ అవుతాయి. అందుకే ఈ సినిమా చూసి చిన్న చిన్న విభేదాలతో విడిపోయిన ఎన్నో కుటుంబాలు ఒక్కటయ్యాయి. మనస్సు మార్చుకుని ఫ్యామిలీలు మళ్లీ ఎప్పటిలాగే కలిసిపోయాయి. ఈ నేపథ్యంలో అప్పట్లో పలు గ్రామాల్లో పెద్ద పెద్ద తెరలపై ఈ సినిమాను ప్రదర్శించి బంధాలు, బంధుత్వాల విలువలను ప్రతి ఒక్కరి తెలిసేలా చేశారు. అయితే, తాజాగా రాజన్న సిరిసిల్ల (Rajanna siricilla) జిల్లా ఓ ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది.
కోనరావుపేట మండలం కొలనూరు గ్రామంలో మామిండ్ల నాగయ్య, మామిండ్ల రాములు అనే అన్నదమ్ముళ్లు పదేళ్ల క్రితం పలు విభేదాలతో విడిపోయారు. ఒకే గ్రామంలో ఉన్న ఇద్దరు అన్నదమ్ముళ్లు మాట్లాడుకోవటం మానేశారు. అయితే, ఇద్దరిని ఎలాగైనా కలపాలని నాగయ్య కుమారుడు శ్రీనివాస్ ఎన్నో సార్లు ప్రయత్నించి విఫలమయ్యాడు. ఇదిలా ఉండగా నాలుగు రోజుల క్రితం ఒక రోడ్డు ప్రమాదంలో నాగయ్య, రామయ్యల మేనల్లుడు కూన తిరుపతి మరణించగా.. మూడు రోజుల కార్యానికి అన్నదమ్ముళ్లు ఇద్దరు హాజరయ్యారు. ఈక్రమంలో ఇద్దరిని కలపాలని శ్రీనివాస్.. వారి పాత రోజులను, జ్ఞాపకాలను గుర్తు చేయడంతో ఇద్దరు కన్నీరు పెట్టుకున్నారు. ఆరు పదుల వయసులో, కాటికి వెళ్లే ముందు పంతాలు ఎందుకని కలిసి బ్రతుకుదామని, యోగక్షేమలు అడిగి తెలుసుకొని ఆలింగనం చేసుకొని కంట తడి పెట్టుకున్నారు.






