త్యాగానికి ప్రతీక బక్రీద్.. ముస్లింలకు సీఎం రేవంత్ స్పెషల్ విషెస్

by Kema Shiva Kumar |

ఈద్ ఉల్-అధా (బక్రీద్) పర్వదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదరులకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) శుభాకాంక్షలు తెలిపారు.

త్యాగానికి ప్రతీక బక్రీద్.. ముస్లింలకు సీఎం రేవంత్ స్పెషల్ విషెస్
X

దిశ, వెబ్‌డెస్క్: ఈద్ ఉల్-అధా (బక్రీద్) పర్వదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదరులకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ ఫాం ‘X’ వేదికగా ట్వీట్ చేశారు. త్యాగానికి, సహనానికి, భక్తి విశ్వాసాలకు బక్రీద్ పండుగ ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. శాంతి, కరుణ, సహనం, సామరస్యం, ఐకమత్యం, సోదరభావం స్ఫూర్తితో ఈ పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. అదేవిధంగా భాగస్వామ్యం, దానధర్మం, గౌరవం, అవసరమైన వారికి సాయం చేయడం బక్రీద్ పండుగ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. దేవుడిపై విశ్వాసంతో సన్మార్గంలో జీవనం సాగించాలని సందేశాన్ని బక్రీద్ ఇస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Next Story