తెలంగాణలో బక్రీద్ సెలవు మార్పు.. ప్రభుత్వ సెలవు ఎప్పుడంటే?

by Prasad Jukanti |

తెలంగాణలో మే 27న ఇవ్వాల్సిన బక్రీద్ సెలవును రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా మార్చివేసింది.

తెలంగాణలో బక్రీద్ సెలవు మార్పు.. ప్రభుత్వ సెలవు ఎప్పుడంటే?
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం బక్రీద్ పండగ సెలవుదినాన్ని మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. పాత క్యాలెండర్ ప్రకారం మే 27, 2026 (బుధవారం) ఇవ్వాల్సిన బక్రీద్ సెలవును మే 28, 2026 (గురువారం) నాటికి మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ వక్ఫ్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మైనారిటీ సంక్షేమ శాఖల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, సిఫార్సులను పరిశీలించిన ప్రభుత్వం ఈ మార్పును ఖరారు చేసింది. నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్, 1881 (N.I. Act) ప్రకారం మే 28వ తేదీని సాధారణ సెలవు దినంగా ప్రకటిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు పేరుతో ఉత్తర్వులు విడుదలయ్యాయి. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, బ్యాంకులకు ఈ మార్పు వర్తిస్తుందని అధికారులు స్పష్టం చేశారు.

Next Story