- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇలాంటి పరిస్థితుల్లో అందాల పోటీలు అవసరమా: భజరంగ్‌దళ్
హైదరాబాద్ లో జరగనున్న అందాలపోటీలపై భజరంగ్ దళ్ అభ్యంతరం వ్యక్తం చేసింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని ఓ వైపు సీఎం రేవంత్ రెడ్డినే చెప్తున్నారని, మరోవైపు భారత్ - పాకిస్థాన్‌ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొందని గుర్తుచేశారు.

దిశ, వెబ్‌డెస్క్: మిస్ వరల్డ్ - 2025 (Miss World 2025) అందాల పోటీలకు హైదరాబాద్ ముస్తాబవుతోంది. పోటీలో పాల్గొనే అందాల భామలతో పాటు పలువులు సెలబ్రిటీలు హైదరాబాద్ కు విచ్చేస్తున్నారు. అందాలపోటీలకు చేస్తున్న ఏర్పాట్లపై ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధికారులు, మంత్రులతో సమావేశం కూడా నిర్వహించారు. తాజాగా ఈ విషయంపై భజరంగ్‌దళ్ అభ్యంతరం వ్యక్తం చేసింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని ఓ వైపు సీఎం రేవంత్ రెడ్డినే చెప్తున్నారని, మరోవైపు భారత్ - పాకిస్థాన్‌ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొందని గుర్తుచేశారు. సైన్యానికి అండగా నిలబడాల్సిన సమయంలో.. హైదరాబాద్‌లో అందాల పోటీలను నిర్వహించడం అవసరమా అని భజరంగ్‌దళ్ రాష్ట్ర కన్వీనర్ శివరాములు ప్రశ్నించారు. ఈ విషయంపై ప్రభుత్వం ఆలోచించాలని, అందాలపోటీల కంటే దేశ భద్రతే ముఖ్యమన్న విషయాన్ని గ్రహించాలని సూచించారు.






