- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Chicken Lovers: చికెన్ లవర్స్‌కు షాక్! రాష్ట్రానికి చికెన్, గుడ్లు బంద్!
చికెన్ ప్రియులకు షాక్ తగిలేలా ఉంది. తెలంగాణలో చాలా కుటుంబాలు చికెన్, మటన్, గుడ్లు వంటకాలు ఖచ్చితంగా తింటాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో ఆదివారం వచ్చిందంటే చాలా కుటుంబాలు చికెన్, మటన్, గుడ్లు వంటకాలు ఖచ్చితంగా తింటాయి. అయితే ఈ ఆదివారం (Chicken Lovers) చికెన్ ప్రియులకు షాక్ తగిలేలా ఉంది. మార్కెట్లో చికెన్, గుడ్లు (eggs and chicken) తక్కువగా లభించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. పొరుగు రాష్ట్రాల్లో అత్యంత వ్యాధికారక ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా కేసులు నమోదవుతున్నాయని నివేదికలు వస్తున్న నేపథ్యంలో తెలంగాణలోకి ప్రవేశించే అన్ని కోళ్ల వాహనాల కదలికలను పశుసంవర్ధక శాఖ నిశితంగా పరిశీలిస్తోంది. రాష్ట్రానికి వచ్చే వాహనాల్లో వ్యాధి కలిగిన కోళ్లు, గుడ్లు, వచ్చే అవకాశం ఉండటంతో తాజాగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ముఖ్యంగా ఆదివారం కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ జిల్లాల నుంచి ప్రతి వారం పెద్ద ఎత్తున కోళ్ల సరఫరా అవుతుంటాయి. దీంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో ఆ వ్యాధి ప్రబలకుండా ఉండేందుకు ప్రభుత్వం అలెర్ట్ అయింది. ఆదివారం రాష్ట్రానికి పొరుగు రాష్ట్రాల చికెన్, గుడ్లు రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. ఈ క్రమంలోనే సరిహద్దులో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి పశుసంవర్ధక శాఖ ప్రత్యేక నిఘా పెట్టింది. కాగా, అన్ని జిల్లా కలెక్టర్లకు ఇన్‌ఫ్లుఎంజా(హెచ్‌పీఏఐ) నివారణ గురించి కోళ్ల పెంపకందారులు, ప్రజలకు అవగాహన కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
జూపార్క్‌లో చికెన్, గుడ్లు నిలిపివేత
హైదరాబాద్‌లోని జూ పార్క్ మాంసాహారం తినే జంతువులకు కోళ్లు, గుడ్ల సరఫరాను నిలిపివేసినట్లు తెలిసింది. నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో పులులు, సింహాలు లాంటి మాంసాహారం జంతువులకు చికెన్, గుడ్లు బదులుగా మటన్, గొడ్డు మాంసం, పంది మాంసం ఇస్తున్నట్లు సమాచారం.






