- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్యాక్ టు యాక్షన్..! రేపు పార్లమెంట్ ఇంచార్జ్ మంత్రులతో CM రేవంత్ భేటీ
విదేశీ పర్యటన ముగిసి నగరానికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అప్పుడే పార్టీ, పాలనా వ్యవహారాలపై ప్రధానంగా దృష్టి సారించారు.

దిశ, వెబ్‌డెస్క్: విదేశీ పర్యటన ముగిసి నగరానికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అప్పుడే పార్టీ, పాలనా వ్యవహారాలపై ప్రధానంగా దృష్టి సారించారు. ఈ క్రమంలోనే ఆయన రేపు సాయంత్రం 6:30 గంటలకు జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో పార్లమెంట్ ఇంచార్జ్ మంత్రులతో సమావేశం కానున్నారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, అభివృద్ధి పనులు, జిల్లాల వారీగా సంక్షేమ పథకాల అమలుపై చర్చించేందుకు ఈ భేటీని ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది.
ఈ సమావేశానికి ఏఐసీసీ (AICC) ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan), పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) కూడా హాజరుకానున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, పార్టీ బలోపేతం, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు.





