- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజేంద్రనగర్‌లో చెత్తకుండిలో పసికందు
by Sathputhe Rajesh |
దిశ, డైనమిక్ బ్యూరో: రోజు రోజుకూ ప్రజల్లో మానవత్వం తగ్గిపోతోంది. నవమాసాలు మో

X
దిశ, డైనమిక్ బ్యూరో: రోజు రోజుకూ ప్రజల్లో మానవత్వం తగ్గిపోతోంది. నవమాసాలు మోసిన ఓ తల్లి, పుట్టగానే చనిపోయిన పసికందును చెత్తకుప్పలో పడేసిన ఘటన హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో జరిగింది. మంగళవారం స్థానికంగా ఉన్న ఓ చెత్తకుండిలో కూరగాయల చెత్త, కవర్లు, పేపర్లతో కలిపి శిశువు మృతదేహాన్ని మూట కట్టినట్లు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు.. శిశువు పుట్టగానే మరణించి ఉంటుందని తెలిపారు. శిశువు మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






