- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సింగరేణి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా బి.వెంకన్న బాధ్యతల స్వీకరణ
సింగరేణి కాలరీస్ లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కోల్ మూమెంట్)గా బి.వెంకన్న సోమవారం బాధ్యతలు స్వీకరించారు.

దిశ, తెలంగాణ బ్యూరో : సింగరేణి కాలరీస్ లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కోల్ మూమెంట్)గా బి.వెంకన్న సోమవారం బాధ్యతలు స్వీకరించారు. 2010 భారతీయ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ (ఐఆర్టీఎస్)కు చెందిన ఆయనను మూడేళ్ల పాటు సింగరేణికి డిప్యూటేషన్‌పై పంపించారు. ఈ నేపథ్యంలో ఆయన సింగరేణి భవన్ లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. ముందుగా సంస్థ సీఎండీ ఎన్.బలరామ్‌ను కలిశారు. ఈ సందర్భంగా సీఎండీ ఎన్.బలరామ్ మాట్లాడుతూ సింగరేణి సంస్థలో ప్రతీ ఏటా సుమారు 700 లక్షల బొగ్గు రవాణా జరుగుతూ ఉంటుందని దీనిలో అధిక భాగం రైలు మార్గం ద్వారా పలు రాష్ట్రాల విద్యుత్ కేంద్రాలకు సరఫరా అవుతుందని ఈ నేపథ్యంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా కంపెనీ లక్ష్యాలను సాధిస్తూ సంస్థ ప్రగతిలో భాగస్వాములు కావాలని సూచించారు.
సింగరేణి సంస్థలో పనిచేయటం ఒక అదృష్టంగా భావిస్తున్నానని, నిర్దిష్ట లక్ష్యాల మేరకు బొగ్గు రవాణా జరపడంలో శక్తి మేర కృషి చేస్తానని బి.వెంకన్న ఈ సందర్భంగా సీఎండీకి తెలియజేశారు.






