TG: పేద విద్యార్థులకు గుడ్ న్యూస్.. రూ.30 వేల స్కాలర్‌షిప్‌ మిస్ చేసుకోకండి!

by Gantepaka Srikanth |

నైపుణ్యం కలిగిన యువతీ, యువకులు చదువుకోవడానికి ఆర్థిక ఇబ్బందులు లేకుండా చేయాలనే ఉద్దేశంతో ప్రతీ సంవత్సరం 15 వేల మందికి అజీం ప్రేమ్‌జీ ఫౌండేషన్ స్కాలర్‌షిప్ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తోంది.

TG: పేద విద్యార్థులకు గుడ్ న్యూస్.. రూ.30 వేల స్కాలర్‌షిప్‌ మిస్ చేసుకోకండి!
X

దిశ, తెలంగాణ బ్యూరో: నైపుణ్యం కలిగిన యువతీ, యువకులు చదువుకోవడానికి ఆర్థిక ఇబ్బందులు లేకుండా చేయాలనే ఉద్దేశంతో ప్రతీ సంవత్సరం 15 వేల మందికి అజీం ప్రేమ్‌జీ ఫౌండేషన్ స్కాలర్‌షిప్ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తోంది. ఆర్థిక సమస్యల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళా విద్యార్థులకు, ఉన్నత విద్యను అభ్యసించడానికి ఈ స్కాలర్‌షిప్ ఎంతగానో తోడ్పడుతుంది. ప్రతీ సంవత్సరం 15 వేల మందికి రూ.30,000 స్కాలర్‌షిప్‌ను అందిస్తోంది. ముఖ్యంగా, ఆర్థికంగా వెనుకబడిన మహిళా విద్యార్థినులకు ఉన్నత విద్యను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ స్కాలర్‌షిప్ ద్వారా నిరుపేద కుటుంబాలకు చెందిన బాలికలు ఉన్నత విద్యను అభ్యసించవచ్చు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి కోరుతుంది. ఇది విద్యార్థుల భవిష్యత్తుకు మాత్రమే కాకుండా, సమాజ అభివృద్ధికి కూడా దోహదపడుతుందని పేర్కొన్నారు.

విద్యార్థినులు తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలలు లేదా కళాశాలల నుండి 10వ, 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. 2025-26 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ లేదా గుర్తింపు పొందిన ప్రైవేట్ కాలేజ్ లేదా విశ్వవిద్యాలయంలో డిప్లొమా, డిగ్రీ, ఇంజినీరింగ్ లేదా ఎంబీబీఎస్ కోర్సు మొదటి సంవత్సరంలో చేరి ఉండాలి. దరఖాస్తుకు ఎలాంటి రుసుము లేకుండా, ఆన్‌లైన్‌లో మాత్రమే స్వీకరిస్తారు. అర్హతగల విద్యార్థినులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని, ఈ సమాచారాన్ని ఇతరులకు కూడా తెలియజేయాలని తెలంగాణ ఉన్నత విద్యా మండలి కోరుతోంది. దరఖాస్తు చేసుకోవడానికి, మరిన్ని వివరాల కోసం అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించింది.

Next Story