Azharuddin: మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అజారుద్దీన్

by Prasad Jukanti |   (  Updated:2025-11-10 07:01:31  IST  )

అజారుద్దీన్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

Azharuddin: మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అజారుద్దీన్
X

దిశ, డైనమిక్ బ్యూరో: మంత్రిగా మహ్మద్ అజారుద్దీన్ (Mohammed Azharuddin) బాధ్యతలు స్వీకరించారు. ఇవాళ కుటుంబ సభ్యులతో కలిసి సచివాలయానికి వచ్చిన అజారుద్దీన్ ముస్లిం ప్రార్థనల మధ్య ఆయన తన ఛాంబర్‌లో మైనార్టిటీల సంక్షేమం (Minority Welfare Department), పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ (Public Enterprises Department) శాఖల బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన అజారుద్దీన్ తనపై ముఖ్యమంత్రి పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చెప్పారు. రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అజారుద్దీన్ కు పలువురు నేతలు, అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. కాగా గత నెల 31న అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం చేయించారు. ఆ తర్వాత నవంబర్ 4వ తేదీన అజారుద్దీన్ కు శాఖలు కేటాయించగా తాజాగా ఆయన ఆ శాఖలకు బాధ్యతలు స్వీకరించారు.

Next Story