Jubilee Hills By-Elections: ప్రియాంక గాంధీతో అజారుద్దీన్ భేటీ

by Gantepaka Srikanth |

కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎంపీ మహ్మద్ అజారుద్దీన్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీతో భేటీ అయ్యారు.

Jubilee Hills By-Elections: ప్రియాంక గాంధీతో అజారుద్దీన్ భేటీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎంపీ మహ్మద్ అజారుద్దీన్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీతో భేటీ అయ్యారు. శుక్రవారం పార్లమెంట్‌లో ఆమెను కలిసిన అజారుద్దీన్.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తనకు టిక్కెట్టు ఇవ్వాల్సిందిగా కోరినట్లుగా సమాచారం. జూబ్లీహిల్స్ టిక్కెట్టు ఎలాగైనా దక్కించుకోవాలని అజారుద్దీన్ పట్టుదలతో ఉన్నట్లుగా సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ తానే అక్కడి నుంచి పోటీ చేశానని, అప్పుడున్న పరిస్థితుల్లో తాను ఓడిపోవాల్సి వచ్చిందని, ఈసారి ఉప ఎన్నికల్లో తాను తప్పకుండా గెలుస్తానని ఆయన ధీమా వ్యక్తం చేసినట్లుగా సమాచారం. తనకు పోటీ చేసే అవకాశం కల్పించాల్సిందిగా ఆయన కోరినట్లుగా తెలిసింది. అజారుద్దీన్ వినతిపై ప్రియాంక గాంధీ పార్టీ నాయకులతో చర్చిస్తానని ఆమె చెప్పినట్లుగా సమాచారం.

Next Story