సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన అజారుద్దీన్

by Muthe.Rajitha |   (  Updated:2025-10-29 12:45:37  IST  )

తెలంగాణ కేబినెట్ లోకి కాంగ్రెస్ మైనార్టీ నేత మహమ్మద్ అజారుద్దీన్ ను చేర్చుకోనున్న సంగతి తెలిసిందే.

సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన అజారుద్దీన్
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ కేబినెట్ లోకి కాంగ్రెస్ మైనార్టీ నేత మహమ్మద్ అజారుద్దీన్ ను చేర్చుకోనున్న సంగతి తెలిసిందే. ఎల్లుండి మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో... కొద్దిసేపటి క్రితం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు అజారుద్దీన్. సీఎం రేవంత్ జూబ్లీహిల్స్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి.. సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉపఎన్నిక జరగనున్న క్రమంలో.. ఆ నియోజకవర్గంలోని దాదాపు 70 వేల మైనార్టీ ఓట్లకోసం కాంగ్రెస్ అధిష్టానం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ఇప్పటివరకు మంత్రివర్గంలో ఇప్పటివరకు మైనార్టీ మంత్రి లేకపోవడం కూడా అజారుద్దీన్ కు కలిసి వచ్చిన అంశం. ఇందుకోసమే జూబ్లీహిల్స్ టికెట్ అజారుద్దీన్ ఇవ్వలేదని అప్పట్లో మీడియాలో కథనాలు ప్రసారం కాగా.. వాటిని నిజం చేస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది.

Read More... జూబ్లీహిల్స్ బై పోల్ వేళ బీఆర్ఎస్‍‍కు రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్!

Next Story