ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్, కోదండరామ్ ప్రమాణ స్వీకారం

by Prasad Jukanti |   (  Updated:2026-04-27 07:16:36  IST  )

తెలంగాణలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా మంత్రి అజారుద్దీన్, ప్రొఫెసర్ కోదండరామ్ ప్రమాణ స్వీకారం చేశారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వీరితో ప్రమాణం చేయించారు.

ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్, కోదండరామ్ ప్రమాణ స్వీకారం
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎమ్మెల్సీలుగా మంత్రి అజారుద్దీన్, ప్రొ.కోదండరామ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇవాళ వారి చేత శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ ప్రమాణం చేయించారు. ఈ ప్రమాణ స్వీకారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు హాజరయ్యారు. కాగా గత కొంత కాలంగా తెలంగాణ గవర్నర్ కోటా ఎమ్మెల్సీల భర్తీ తీవ్ర ఉత్కంఠ రేపిన సంగతి తెలిసిందే. ఈ కోటాలో రాష్ట్ర మంత్రి మహమ్మద్ అజారుద్దీన్, ప్రొఫెసర్ కోదండరామ్‍ల నియామకానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదించినా ఈ ఫైల్ గవర్నర్ వద్ద ఇన్నాళ్లు పెండింగ్‍లో ఉంది. దీంతో అసెంబ్లీలో ప్రాతినిథ్యం లేకుండానే మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న అజారుద్దీన్ మంత్రి పదవిపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఈ నెలాఖరుతో ఆయన అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహించకపోతే తన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి పరిస్థితుల్లో గవర్నర్ కోటాలో శాసనమండలి సభ్యులుగా కోదండరామ్, అజారుద్దీన్ పేర్లను గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా నామినేట్ చేశారు. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేయడంతో ఇవాళ ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు.

Next Story