అవకాశం ఇస్తే.. మళ్లీ HCA బాధ్యతలు స్వీకరిస్తా: మాజీ ప్రెసిడెంట్ అజారుద్దీన్ ప్రకటన

by Gantepaka Srikanth |

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్మోహన్‌రావు(Jagan Mohan Rao) అరెస్ట్‌ అయిన విషయం తెలిసిందే.

అవకాశం ఇస్తే.. మళ్లీ HCA బాధ్యతలు స్వీకరిస్తా: మాజీ ప్రెసిడెంట్ అజారుద్దీన్ ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్మోహన్‌రావు(Jagan Mohan Rao) అరెస్ట్‌ అయిన విషయం తెలిసిందే. ఐపీఎల్ టికెట్ల వివాదంలో విజిలెన్స్ నివేదిక ఆధారంగా సీఐడీ అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. జగన్మోహన్‌రావుతోపాటు హెచ్‌సీఏ సభ్యులను కూడా సీఐడీ అరెస్ట్ చేసింది. తాజాగా ఈ పరిణామాలపై హెచ్‌సీఏ మాజీ ప్రెసిడెంట్, కాంగ్రెస్ నేత అజారుద్దీన్(Azharuddin) స్పందించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధ్యక్షుడి అరెస్ట్ హెచ్‌సీఏకు అవమానం అని అన్నారు. టికెట్లు ఇచ్చిన తర్వాత అదనపు టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేయడం, ఒప్పుకోకపోతే వేధించే ప్రయత్నం చేయడం దారుణమని సీరియస్ అయ్యారు.

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌(Hyderabad Cricket Association)కు తాను ఎంతో చేశారని అన్నారు. తక్షణమే అసోసియేషన్‌ను రద్దు చేసి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. అవకాశం వస్తే.. తాను మళ్లీ HCA బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధమని ప్రకటించారు. గ్రూపు రాజకీయాలు పక్కనబెట్టి ఆటపై దృష్టి పెట్టాలని సూచించారు. మరోవైపు విజిలెన్స్ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. టికెట్ల విషయంలో సన్‌రైజర్స్‌పై హెచ్‌సీఏ ఒత్తిడి తీసుకొచ్చిందని.. 20శాతం టికెట్లు ఇవ్వాలని బెదిరింపులకు గురిచేసిందని విజిలెన్స్ కమిటీ నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక ఆధారంగా సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలోనే హెచ్‌సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావుతో పాటు పలువురిని అరెస్ట్ చేసింది.

Next Story