మంత్రి వర్గంలోకి అజారుద్దీన్.. ఎక్స్ వేదికగా ఆసక్తికరమైన ట్వీట్

by Malleboina Mahesh |

గవర్నర్ కోటా ఎమ్మెల్సీ, తెలంగాణ కేబినెట్ లో చోటు కల్పించడంపై కాంగ్రెస్ నేత అజారుద్దీన్ ఎక్స్ వేదికగా ఆసక్తికరమైన ట్వీట్ చేశాడు.

మంత్రి వర్గంలోకి అజారుద్దీన్.. ఎక్స్ వేదికగా ఆసక్తికరమైన ట్వీట్
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ క్రికెటర్, తెలంగాణ కాంగ్రెస్ నేత మహమ్మద్ అజారుద్దీన్ (Mohammad Azharuddin)ను ఆ పార్టీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే హైదరాబాద్ నగరం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తుండడం, మంత్రి మండలిలో మైనారిటీలు లేకపోవడంతో ఆయనకు మంత్రి పదవి ఫిక్స్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలను మహమ్మద్ అజారుద్దీన్ బలం చేకూరుస్తూ.. ఎక్స్ వేదికగా ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ఆయన తన ట్వీట్‌లో తెలంగాణలో గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీ (Mlc) పదవికి నన్ను నామినేట్ చేయాలని మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం నన్ను ఎంతో గౌరవించింది. నేను ఎంతో వినయంగా భావిస్తున్నాను." అని అజారుద్దీన్ రాసుకొచ్చాడు.

తనకు ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్‌లకు నా హృదయపూర్వక ధన్యవాదాలు, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, తెలంగాణ మంత్రి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మీనాక్షీ నటరాజ్ మద్దతుగా కృతజ్ఙతలు, నేను సమగ్రత మరియు అంకితభావంతో మన రాష్ట్రానికి సేవ చేయడానికి కట్టుబడి ఉన్నాను." అని కాంగ్రెస్ సీనియర్ నేత అయిన మహమ్మద్ అజారుద్దీన్ తన ట్వీట్ లో రాసుకొచ్చాడు.

ట్వీట్..

Next Story