సీఎంఓ సీపీఆర్వోగా అయోధ్యరెడ్డి

by Bhoopathi Nagaiah |

ముఖ్యమంత్రి కార్యాలయం సీపీఆర్వో (చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్)గా సీనియర్ పాత్రికేయులు అయోధ్యరెడ్డిని నియమించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నది.

సీఎంఓ సీపీఆర్వోగా అయోధ్యరెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో : ముఖ్యమంత్రి కార్యాలయం సీపీఆర్వో (చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్)గా సీనియర్ పాత్రికేయులు అయోధ్యరెడ్డిని నియమించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నది. ఒకటి రెండు రోజుల్లో దీనిపై స్పష్టత రానున్నది. దీర్ఘకాలంపాటు ప్రింట్ మీడియాలో పనిచేసిన అయోధ్యరెడ్డి కొంతకాలం క్రితం యాక్టివ్ జర్నలిజం నుంచి తప్పుకున్నారు. పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి నియమితులైన తర్వాత కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్‌గా ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో ఆయను సీపీఆర్వోగా నియమించాలనే ప్రాథమిక నిర్ణయం జరిగింది. ప్రభుత్వం నుంచి అధికారికంగా ఉత్తర్వులు వెలువడిన తర్వాత ఆయన బాధ్యతలు తీసుకునే అవకాశమున్నది.

Next Story