వరుస రోడ్డు ప్రమాదాలు.. అధికారులకు మంత్రి పొన్నం కీలక సూచనలు

by Prasad Jukanti |   (  Updated:2025-11-05 10:09:47  IST  )

రోడ్డు యాక్సిడెంట్ బాధితులకు ఫ్రీ ట్రీట్మెంట్ పై అవగాహన కల్పించాలని మంత్రి పొన్నం సూచించారు.

వరుస రోడ్డు ప్రమాదాలు..  అధికారులకు మంత్రి పొన్నం కీలక సూచనలు
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: రోడ్డు ప్రమాదాలపై విస్తృతంగా అవగాహన ర్యాలీలు నిర్వహించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ఆర్టీఏ శాఖ అధికారులకు సూచించారు. ఇటీవల వరుస రోడ్డు ప్రమాదాలు, వాటిలో మరణాల సంఖ్య అధికం అవుతున్న నేపథ్యంలో యూనిసెఫ్ ఆధ్వర్యంలో ఆర్టీఏ మెంబెర్స్ రీజనల్ ట్రాన్స్ పోర్ట్ అథారిటీ నాన్ అఫీషియల్ మెంబెర్స్ కు ఇవాళ హైదరాబాద్ లోని మెర్క్యూరీ హోటల్‍లో రోడ్డు భద్రతపై తీసుకోవాల్సిన చర్యలు, అవగాహన కల్పించాల్సిన అంశాలపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. వచ్చే నెలలో నిర్వహించబోయే రోడ్ సేఫ్టీ మాసంలో (Road Safety Month) భాగంగా ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలని సూచించారు. ఇటీవల కర్నూల్, చేవెళ్ల బస్సు ప్రమాదలు జరిగిన తీరు ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు. రోడ్డు ప్రమాదాలు, మరణాలు సంభవించకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకునేలా గ్రామాల్లో అవగాహన ర్యాలీలు నిర్వహించి కరపత్రాలు పంచిపెట్టాలని సూచించారు. అలాగే రోడ్డు భద్రతపై స్కూల్‍లు కాలేజీలు, విద్యా సంస్థల్లో వ్యాస రచన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రధానం చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి కేంద్ర ప్రభుత్వం రూ. లక్ష 50 వేలు వరకు అందిస్తున్న ఉచిత చికిత్స పథకంపై (Cashless Treatment Scheme) ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.

హైదరాబాద్ ఎంపిక:

ఈ సందర్భంగా యూనిసెఫ్ ప్రతినిధి డాక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీస్ రిపోర్ట్ ప్రకారం 10-19 సంవత్సరాల వయసులో జరుగుతున్న మరణాల్లో ప్రధానంగా రోడ్డు ప్రమాదాలు కారణమని తెలిపారు. రోడ్డు ప్రమాదాలను నివారించడానికిరోడ్డు ప్రమాదాలపై గ్రామాల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు యూనిసెఫ్ మూడు దేశాల్లో అవగాహన కల్పించడానికి ఎంపిక చేసిందని అందులో మన దేశం నుండి అహ్మదాబాద్, ముంబై, హైదరాబాద్ పట్టణాలను ఎంపిక చేసినట్టు తెలిపారు. దేశంలో సగటున 1317 రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటే అందులో ప్రతిరోజు 477 మరణాలు సగటున సంభవిస్తున్నాయని తెలిపారు. ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డీన్ డాక్టర్ శైలజ మాట్లాడుతూ రోడ్డు నిబంధనలపై స్కూల్‍లు, కాలేజీల్లో అవగాహన కల్పించాలన్నారు. రోడ్డు భద్రత నిబంధనలు తెలవాలంటే విద్యార్థి దశ నుండి ప్రవర్తన ముఖ్యమైందని అందులో భాగంగా ఆక్టివ్, బ్లీడింగ్, కంట్రోల్ ప్రోగ్రాం అమలు చేయాలని సూచించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి రీజనల్ ట్రాన్స్ పోర్ట్ అథారిటీ నాన్ అఫీషియల్ మెంబెర్స్ (ఆర్టీఏ మెంబర్) పాల్గొన్నారు.

READ MORE ....

మరో రోడ్డు ప్రమాదం.. స్పాట్ లో ఐదుగురు యువకులు

Next Story