- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జాతీయ స్థాయిలో తెలంగాణ పోలీస్ కు అవార్డులు
జాతీయ స్థాయిలో న్యూఢిల్లీలో జరిగిన మెరిటోరియస్ సర్వీసెస్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ పబ్లిక్ సర్వీసెస్ పోటీలలో ఏడిజీ వివి శ్రీనివాసరావు నాయకత్వంలో అవార్డులు సాధించిన తెలంగాణ పోలీస్ సిబ్బందిని డీజీపీ డాక్టర్ జితేందర్ అభినందించారు.

దిశ, తెలంగాణ బ్యూరో : జాతీయ స్థాయిలో న్యూఢిల్లీలో జరిగిన మెరిటోరియస్ సర్వీసెస్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ పబ్లిక్ సర్వీసెస్ పోటీలలో ఏడిజీ వివి శ్రీనివాసరావు నాయకత్వంలో అవార్డులు సాధించిన తెలంగాణ పోలీస్ సిబ్బందిని డీజీపీ డాక్టర్ జితేందర్ అభినందించారు. డీజీపీ కార్యాలయంలో బుధవారం డీజీపీ జితేందర్ అవార్డులను ప్రదర్శించారు. ఎస్ కె వోసీహెచ్ గ్రూప్ ఆధ్వర్యంలో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ పబ్లిక్ సర్వీసెస్ పోటీలలో పోలీసుల డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ప్రాజెక్ట్‌లతో తెలంగాణ పోలీస్ పాల్గొన్నట్లు తెలిపారు . ఎలక్ట్రానిక్ పెటి కేస్ మొబైల్ అప్లికేషన్ విభాగంలో రజత పురస్కారం , స్మార్ట్ పోలీస్ స్టేషన్లు స్మార్ట్ పోలీసింగ్ లో ఆర్డర్ ఆఫ్ మెరిట్ సర్టిఫికేట్, ఇంటిగ్రేటెడ్ పెట్రోల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ లో మెరిట్ సర్టిఫికేట్ ఆర్డర్ పోందినట్లు తెలిపారు. తెలంగాణ పోలీస్ డిపార్ట్‌మెంట్ తరపున, ఈ అవార్డులను డీఎస్పీ ఐటీ రవి చంద్ర, సిల్వర్ ఓక్ హాల్, ఇండియా హాబిటాట్ సెంటర్, న్యూఢిల్లీ లో ఫిబ్రవరి 15వ తేదిన కాన్వకేషన్‌లో అందుకున్నారు.






