Hari Chandana : హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందనకు అవార్డు

by Ramesh Naini |

హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన దాసరికి అవార్డు లభించింది.

Hari Chandana : హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందనకు అవార్డు
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన దాసరికి అవార్డు లభించింది. సీఎం ప్రజావాణి, కలెక్టర్ ప్రజావాణి, వాట్సప్ ప్రజావాణి ద్వారా వచ్చిన ప్రజా దరఖాస్తులను అత్యధికంగా పరిష్కరించినందుకు ఆమె అవార్డు పొందారు. ఈ అవార్డును శుక్రవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేతుల మీదుగా కలెక్టర్ హరిచందన స్వీకరించారు.ప్రజల సమస్యలకు వేగంగా స్పందిస్తూ, దరఖాస్తుల పరిష్కారంలో సమర్థత చూపినందుకు ఈ గుర్తింపు లభించినట్లు అధికారులు తెలిపారు. ప్రజావాణి కార్యక్రమాలను మరింత ప్రభావవంతంగా అమలు చేయడంలో కలెక్టర్ కీలక పాత్ర పోషించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. ప్రజాసేవలో ఉత్తమ ఫలితాలు సాధించిన అధికారులను ప్రోత్సహించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ అవార్డులను అందజేస్తున్నట్లు ఈ సందర్భంగా వారు తెలిపారు.

Next Story