- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇరకాటంలో రేవంత్ సర్కార్.. 3న ‘చలో అసెంబ్లీ’కి పిలుపునిచ్చిన ఆటో డ్రైవర్లు
ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఆటో డ్రైవర్ల సంఘాల జేఏసీ (Joint Action Committee) జనవరి 3న చలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చింది.

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఆటో డ్రైవర్ల సంఘాల జేఏసీ (Joint Action Committee) జనవరి 3న చలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఆటో సంఘాల జేఏసీ నాయకులు ఇచ్చిన పిలుపులో భాగంగా హైదరాబాద్‌లోని ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోసం ఈ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లుగా హామీలను అమలు చేయకపోవడం, మహాలక్ష్మి పథకంతో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వల్ల ఆటోల ఆదాయం తీవ్రంగా తగ్గడం, ర్యాపిడో వంటి బైక్ టాక్సీలను నిషేధించకపోవడం వంటి అంశాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.
మా నోటికాడి కూడును గుంజేసుకుండ్రు..
కాంగ్రెస్ 2023 అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి రూ.12 వేల ఆర్థిక సాయం, ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు, ఇతర సంక్షేమ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. అయితే, ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్ల తర్వాత కూడా ఈ హామీలు అమలు కాకపోవడంతో ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత రెండేళ్లలో ఆదాయం తగ్గడం వల్ల అనేక మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఆటో జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వం మా నోటికాడి కూడును గుంజేసుకుందని అన్నారు. ర్యాపిడో బైక్స్‌ను నిషేధించాలని, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, నష్టపరిహారం ఇవ్వాలని చాలాసార్లు విన్నిపించామని తెలిపారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదన్నారు. ఈ క్రమంలోనే అసెంబ్లీ ముట్టడికి నిర్ణయించామని పేర్కొన్నారు. జనవరి 3న భారీ ఎత్తున ఆటో డ్రైవర్లతో చలో అసెంబ్లీ కార్యక్రమం ఉంటుందన్నారు. ఆటో డ్రైవర్ల విషయంలో ప్రభుత్వం త్వరగా స్పందించకపోతే తమ భవిష్యత్ కార్యచరణను ప్రకటిస్తామని ఆటో డ్రైవర్ల సంఘాల జేఏసీ స్పష్టం చేసింది.






