- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓలా, ఉబర్, రాపిడో బ్యాన్ చేయాలి.. ఆటో డ్రైవర్ డిమాండ్
ఓలా, ఉబర్, రాపిడో బ్యాన్ చేయాలని హన్మకొండ కాకతీయ ఆటో యూనియన్ సభ్యుడు షేక్ ఖాజా పాషా తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

దిశ, వెబ్ డెస్క్: ఓలా, ఉబర్, రాపిడో బ్యాన్ చేయాలని హన్మకొండ కాకతీయ ఆటో యూనియన్ సభ్యుడు షేక్ ఖాజా పాషా తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఓలా, ఉబర్, ర్యాపిడో వల్ల ఆటో డ్రైవర్ల ఆదాయం తగ్గిపోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో 60 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ యాప్ లను బ్యాన్ చేయాలని సంవత్సరం నుండి పోరాటం చేస్తున్నా తెలంగాణ ప్రభుత్వం స్పందించడం లేదని అన్నారు. కర్నాటకలో వీటిని బ్యాన్ చేశారని గుర్తు చేశారు. తెలంగాణలో మెదక్, వరంగల్, హైదరాబాద్, కరీంనగర్ ఇలా అన్ని ప్రధాన నగరాల్లో ఓలా, ఉబర్ వల్ల ఆటో డ్రైవర్లకు ఆదాయం లేకుండా పోతుందని మిర్శించారు. వెంటనే బ్యాన్ చేయపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అధికారులను తట్టి లేపుతామని హెచ్చరించారు.
Read More : కర్ణాటకలో బైక్ టాక్సీలపై నిషేధం






